ఫ్రెంచ్ క‌థ‌కుడు మోపాసా తెలుసు కానీ ఈ ప్రభాస్ ఎవ‌రు.. ప‌చ్చ బొట్టేసిన పిల్ల‌గాడు వాడేనా.. వ‌ర్షం సినిమాతో ట్రెండు బెండు తీసింది వాడేనా.. వాడేనా అత‌డేనా..బాహుబ‌లితో చ‌రిత్ర సృష్టించింది వాడేనా..అభిమానులుంటే చాలు పొంగిపోతాడు ఆయ‌నేనా..
ఈ రోజు పండుగ రోజు పుట్టిన రోజు పండుగ రోజు హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్..

ప్ర‌భాస్ పూరీ మంచి ఫ్రెండ్సు.. ఫ్రెండు అని చెప్ప‌డంలో అర్థం ఉంది. సాయం అంటే వ‌చ్చే వాడు. క‌ష్టం అంటే క‌దిలేవాడు అని.. డార్లింగ్ కు మ‌రో మంచి గుణం ఉంది. త‌ను ఉంటే మంచి జ‌రుగుతుంది అంటే త‌ప్ప‌క ఉంటాడు. త‌ప‌న‌తో ప‌నిచేస్తాడు. ఫ్లాపున్నా హిట్టున్నా ఒకేలా ప‌నిచేసే బుజ్జిగాడు.. మాసివ్ ఎపీల్ ఉన్న స్టార్.. మున్నా లాంటి మంచి ఫేం ఉన్నోడు.. నిన్నా మొన్నా ఈ వైనం ఉందో లేదో తెల్వ‌నోడు.. మా ఊరి పిల్ల‌గాళ్లంటే భ‌లే ప్రాణ‌మిస్త‌డు. శ్రీ‌కాకుళం ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంటే ముచ్చ‌ట‌ప‌డిపోతాడు.

స‌ర్ మీరొక సినిమా చేయాలి.. పేరు ఛ‌త్ర‌ప‌తి.. వెరీ ప‌వ‌ర్ ఫుల్ లీడ్ రోల్.. బానిస సంకెళ్ల నుంచి ఎదిగి వ‌చ్చిన నాయ‌కుడు.. చరిత్ర లో ఇలాంటి వారెంద‌రో..వారే ఇత‌డికి స్ఫూర్తి.. క‌థ చెప్పాడు రాజ‌మౌళి.. ఒక్క అడుగు అంటూ సంచ‌ల‌నం రేపాడు ప్ర‌భాస్..మరి!
ఆ సినిమాతోనే ఏ వ‌చ్చి బీపై వాలే బీ వ‌చ్చి సీ పై వాలే అన్న పాటతో తెగ హ‌ల్ చ‌ల్ చేశాడు. అబ్బో! ఆ పాటే ఓ ట్రెండ్ సెట్ట‌ర్ భయ్యా..

ఈ సారి  రామోజీ ఫిల్మ్ సిటీకి మ‌నం పోవాలి.. అక్క‌డ రాజ‌మౌళీ ఉంటారు..ఆయ‌న టీం ఉంటుంది. ఏక్ నిరంజ‌న్ లాంటి రాజ‌మౌళీకి బుజ్జి గాడు ఎదురయ్యాడు. ఆ బుజ్జిగాడే బాహుబ‌లి రూపంలో పెద్దాడ‌య్యాడు. ప్రపంచ సినీ చ‌రిత్ర‌నే ప్ర‌భావితం చేశాడు. రాజ‌మాత శివగామీ దేవి ఆశీస్సుల‌తో అంత‌టి వాడ‌యిన ప్ర‌భాస్ ఇప్ప‌టికీ పెద్ద‌నాన్న కృష్ణంరాజు ద‌గ్గ‌ర ఒదిగే ఉంటాడు. త‌న‌ను న‌మ్మి నాలుగు పైస‌లు పెట్టే నిర్మాత‌ల‌కు అండ‌గా ఉంటాడు. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే త‌న పేరు సుస్థిరం చేసినా ఆ గ‌ర్వం పొగ‌రు  లేని మంచి హీరో.. మ‌న‌సున్న హీరో.. ప్ర‌భాస్.. హ్యాపీ బ‌ర్త్డే స‌ర్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: