ల‌వ్ యూ డార్లింగ్ అని మీరు రాశారా పొంగి పోతాడు ప్ర‌భాస్. సినిమాల్లోనూ బ‌య‌ట కూడా అలానే ఉంటాడు. త‌న కోసం ఎవ్వ‌రు వ‌చ్చినా ఆత్మీయంగా పల‌క‌రిస్తాడు. తన ఇంటి మ‌నిషిలా ఆద‌రిస్తాడు. స‌ర్..మీరు బాగుంటే చాలు..అని నిర్మాత‌ల‌ను ఉద్దేశించి చెప్పి  పంపుతాడు. పెద్ద‌నాన్న కృష్ణం రాజు పేరు చెబితే పొంగిపోతాడు. అవును! ఆయ‌న ప్రేమ‌కు జేజేలు ప‌ల‌కాల్సిందే. శ్రీ‌కాకుళం కేంద్రంగా కొంద‌రు కుర్రాళ్లు ఆయ‌న పేరిట ప్ర‌తి రోజూ ఏదో ఒక సేవా కార్య‌క్ర‌మం చేస్తూనే ఉంటారు. వారే డాడీ హెల్పింగ్ ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు.

రాజుల లోగిళ్లు అని ఓ క‌థ రాశారు ప‌తంజలి అనే రాజుగారు. అలాంటి రాజుల లోగిలి నుంచి వ‌చ్చాడు ప్ర‌భాస్. ఇంకా చెప్పాలంటే.. భీమ‌వ‌రం రాజుల‌కు మంచి మ‌న‌సు మంచి పేరు రెండూ ఉన్నాయి. స‌హాయం అంటే క‌ద‌లివ‌స్తారు. ఆక‌లి అంటే అన్నం పెట్టి పంపుతా రు. అలాంటి రాజుల కుటుంబాల నుంచి వ‌చ్చాడు ప్ర‌భాస్. త‌నేంటో త‌న పనేంటో అంత వ‌ర‌కే ఎవ్వ‌రినీ బాధ‌పెట్ట‌డు. ఎవ్వ రినీ కించ‌పర‌చ డు. పెద్ద‌నాన్న పేరుకు మంచి పేరు తెచ్చే ప్ర‌య‌త్నాలెన్నో చేశాడు. మంచి విజ‌యాలే న‌మోదు చేశాడు. సినిమా లు ఫ్లాప్  ఉన్నా కూ డా ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుని పోయాడు.

స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఆయ‌న స్నేహితులు వంశీ, ప్ర‌మోద్ దే. ఇద్ద‌రూ ఆయ‌న‌కు మంచి స్నేహితు లు. ఆయ‌నకు జీవితం ఇచ్చిన వ‌ర్షం  ఫేం శోభ‌న్ ను ఎన్న‌టికీ మ‌రిచిపోరు. ఆయ‌నంటే ప్ర‌భాస్ కు చాలా ఇష్టం. వాళ్ల‌బ్బాయే సంతోష్ శోభ‌న్. ఈ యువ న‌టుడినీ ప్ర‌భాస్ ఎంత‌గానో ఎంకరేజ్ చేస్తారు. అంతేనా నిన్న మొన్న‌టి ల‌వ్ స్టోరీ సినిమాకూ ఆయ‌న ఎంతో స‌పోర్ట్ ఇచ్చి, సినిమాకు ప్ల‌స్ పాయింట్ గా నిలిచారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోలంద‌రినీ ప్ర‌భాస్ ఇష్ట‌ప‌డ‌తాడు. చిరంజీవి అంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టం. ఇవే కాదు సినిమా ప‌రంగా కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా కొన్ని కుటుంబాల‌తోనే అత్యంత చేరువ‌గా ఉంటారు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళీని మాత్రం గౌర‌విస్తూనే ఉంటాన‌ని, ఆయ‌న‌కు త‌న‌కు మ‌రో జీవితం ఇచ్చిన గొప్ప వారు అని చెబుతూ ఉంటాడు. డియ‌ర్ డార్లింగ్ ! పెద్ద‌నాన్న దీవెన‌ల‌తో మీరు మరింత స్థాయి ఎద‌గాల‌ని ఆశిస్తూ ... ఆల్ ద బెస్ట్ స‌ర్..

 


మరింత సమాచారం తెలుసుకోండి: