ఆదివారం వచ్చేసింది.. మరి ఈ వారం రోజులు ఏం జరిగిందో ఓసారి సమీక్షించుకుందాం.. సీఎం జగన్.. ఈ వారం అనేక కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వారమే ఆయన అవ్వాతాతలకు ఇచ్చే వైయ‌స్ఆర్ పెన్షన్ కానుక‌ రూ.2250 నుంచి రూ.2500కు పెంచ‌ుతున్నామని ప్రకటించారు. ఇది వచ్చే జనవరి నుంచి అమల్లోకి రాబోతుంది. అలాగే డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభిస్తున్నామని.. డిసెంబర్‌ 28న ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేస్తామని ప్రకటించారు. జనరరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని.. జనవరిలోనే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రజలకు శుభవార్తలు చెప్పారు.


ఈవారంలోనే సీఎం జగన్.. భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మ‌హ‌నీయుల‌కు నివాళుల‌ు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో వ‌ల్లభాయి ప‌టేల్‌, పొట్టి శ్రీ‌రాములు చిత్రపటాలకు పూలమాల‌లు వేశారు. అంజలి ఘటించారు.  ఈ వారంలోనే సీఎం జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్ చీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్ చీఫ్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా సీఎంను కలిశారు. ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తాని సీఎం జగన్ స‌న్మానించారు.


ఈ వారంలోనే సీఎం జగన్‌ విశాఖ పర్యటన చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.  అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్‌కు హాజరయ్యారు. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి కూడా సీఎం జగన్  హాజరయ్యారు.


ఈ వారంలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి కలిశారు. ఏపీలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడ‌టం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు. ఈ వారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల డిమాండ్లపైనా చర్చించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: