ఇటీవల ఆడపిల్లల వివాహ వయస్సును 18 నుంచి 21కు పెంచుతూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టంపై ఎలాంటి ముందస్తు చర్చ జరగకుండా మోడీ సర్కారు మందబలంతో బిల్లు పాస్ చేసుకుందని విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ చట్టం ఎంతవరకూ మంచిది.. ఈ చట్టం వద్దని కొందరు మహిళా ఉద్యమ కారులు కూడా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు.. ఈ కోణంలో ఆలోచిస్తే.. ఆడపిల్లల చట్టబద్ధమైన వివాహ వయస్సు పెంచితే బాల్య వివాహాలను అరికట్టవచ్చన్నది నిరూపితం కాని అంశం అంటున్నారు కొందరు విశ్లేషకులు.


ఎందుకంటే.. వివాహ వయస్సు పెంచితే బాల్య వివాహాలను అరికట్టవచ్చని వాదిస్తున్న వారు ముందుగా బాల్య వివాహాల వెనుక వున్నా అసలు కారణాలను అర్థం చేసుకోవాలి. ఆడపిల్లల చట్టబద్ధమైన వివాహ వయస్సును పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేం.  ఎలాగంటే.. 1978లోనే ఆడపిల్లల చట్టబద్ధమైన వివాహ వయస్సును ప్రభుత్వం పెంచింది. అంటే 43 సంవత్సరాల క్రితమే 16 నుండి 18 సంవత్సరాలకు ఆడపిల్లల చట్టబద్ధమైన వివాహ వయస్సును పెంచారు. వాస్తవానికి ఈ చట్టం ద్వారా ఆ తర్వాత సమాజంలో బాల్య వివాహాల సమస్య కనిపించకూడదు.


కానీ వాస్తవంలో ఏం జరిగింది. ప్రభుత్వం చేసే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారమే నేడు బాల్య వివాహాల రేటు 23 శాతంగా వుంది. ఈ పరిస్థితిని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు.. ? ఆడపిల్లల చట్టబద్ధమైన వివాహ వయస్సు పెంచినంత మాత్రాన బాల్య వివాహాలను అరికట్టలేం. బాల్య వివాహాల వెనుక ఉన్న అసలు కారణం కేవలం ఆడపిల్ల వివాహ వయస్సు కానే కాదు. భయంకరమైన పేదరికం, నిరక్షరాస్యత సమాజంలోని పితృస్వామ్య సంప్రదాయాలే బాల్య వివాహాలకు అసలైన కారణాలు.


ప్రస్తుతం 18 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మాయి దేశ భవిష్యత్తును నిర్ణయించడం కోసం తన వంతు పాత్ర పోషిసోతంది. అలాఓటు హక్కు ద్వారా దేశ భవితను నిర్ణయించే ఆడపిల్ల తమ జీవిత నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించడం సబబా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఆడపిల్ల ప్రజాస్వామ్య హక్కులపై దాడి అంటున్నారు కొందరు మహిళా ఉద్యమ కారులు. మోడీ ప్రభుత్వం ఆడపిల్లల చట్టబద్ధమైన వివాహ వయస్సు పెంచటంపై కొందరి వాదన ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: