వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాను త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చారు. స్వపక్షంలో విపక్షంలా మారిన  ఎంపీ రఘురామ కృష్ణంరాజును పార్టీ నుంచి తొలగించాలని వైసీపీ కొంతకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అది సాధ్యం కావడం లేదు. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంటుందిగా.. అందుకే వైసీపీ  ఎంపీ రఘురామ కృష్ణంరాజును భరిస్తూ వస్తోంది. అయితే.. ఇప్పుడు అనర్హత వేటుకు అంతా సిద్ధం అయినట్టుంది. అందుకే..  ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా తానే స్వయంగా రాజీనామా చేస్తానంటున్నారు.


అయితే..  త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిస్తానంటున్నారు  ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. తనపై అనర్హత వేటు వేయించేందుకు సమయం ఇస్తున్నానని.. అనర్హత వేటు వేయకపోతే నేనే రాజీనామా చేస్తానని  ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటున్నారు. నేను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. తన రాజీనామాతో వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని అంటున్నారు.


మరి ఇప్పుడు  ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎలా వదుల్తుందన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఆయన రాజీనామా చేస్తే స్పీకర్ బ్రహ్మాండంగా ఆమోదిస్తారు. ఉప ఎన్నిక  వస్తుంది.. అప్పుడు వైసీపీ మళ్లీ టికెట్ ఇవ్వదు కదా. మరి ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు.. ఒకవేళ టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు ఆయనకు సపోర్ట్‌ చేస్తాయా.. చేసినా రఘురామ మళ్లీ గెలుస్తారా.. అన్నది అనుమానమే.


ఏదేమైనా  ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామాతో వైసీపీకి పట్టిన దరిద్రం మాత్రం వదుల్తుందంటున్నారు ఆ పార్టీ నాయకులు. తనకు సీటు ఇచ్చారన్న కృతజ్ఞత లేకుండా ఇన్నాళ్లూ వైసీపీలోనే ఉంటు ప్రతిపక్షం మైకులా  ఎంపీ రఘురామ కృష్ణంరాజు పని చేసారని ఆ నాయకులు మండిపడుతున్నారు. చూడాలి.. మరి  ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామాతో ఎవరి దరిద్రం వదులుతుందో.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుందా.. వైసీపీకి పట్టిన దరిద్రం వదుల్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR