తెలంగాణలో బలమైన పార్టీ టీఆర్‌ఎస్‌. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీనే బలమైన పార్టీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని రోజులుగా కేసీఆర్‌ తీరు చూస్తే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనేమో అనిపిస్తుంది. అంతగా బీజేపీపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న
వరి కొనుగోలు అంశంపై కేంద్రం తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. ఏకంగా ఢిల్లీకి మంత్రుల టీమ్‌ను పంపించి.. వరి రైతు సమస్యలపై ఢిల్లీలో పోరాడుతున్నాం అనే ఫీలింగ్  కల్పించారు. కేంద్రం తెలంగాణ పట్ల చిన్న చూపు చూస్తోందనే విమర్శల డోసు కూడా కేసీఆర్ పెంచేశారు.


అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. కేసీఆర్ వరి పోరాటం అంటూ ఎంత  హడావిడి చేసినా.. అటు కేంద్రం చెప్పే వాదన కూడా కాస్త సబబుగానే అనిపిస్తుంది. కేసీఆర్ వరి కొనుగోళ్ల విషయంలో ముందుగా చేసుకున్న ఒప్పందాలను పాటించడం లేదని కేంద్రం ఆరోపించింది. అయితే.. ఇక్కడే మనకు చరిత్ర కొన్న విషయాలను గుర్తు చేస్తుంది. గతంలో ఏపీలోని టీడీపీ సర్కారు కూడా ఇలాగే ప్రతిసారీ కేంద్రం తమను ఇబ్బంది పెడుతోందని.. చంద్రబాబు విమర్శించే వారు.. అయితే.. ఆయన కొంతకాలం కేంద్ర ప్రభుత్వంలో పదవులు కూడా తీసుకున్నారు.


మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు.. రాష్ట్రం కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం అని చంద్రబాబు అప్పట్లో బాగా ప్రచారం చేశారు. ఏపీలో తనను ఇబ్బంది పెట్టేందుకు జగన్, కేసీఆర్, మోడీ ఏకమయ్యారని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసారు. కానీ.. అది సత్ఫలితాలు ఇవ్వలేదు. ప్రజలు ఆ వాదనను నమ్మలేదు. ఇప్పడు కేసీఆర్‌ కూడా అదే తరహాలో ఆరోపణలు గుప్పిస్తుంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు.. తప్పుడు కేసులు పెడతామని తమను బెదిరిస్తోందని కేసీఆర్‌ అంటున్నారు.


అయితే.. 2019 ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన ఈ వ్యూహం అట్టర్‌ ఫ్లాప్ అయ్యింది. మోడీ, కేసీఆర్‌ను బూచిగా చూపి ఏపీలో ఓట్ల కోసం ప్రయత్నించారు. అయినా అది ఫలించలేదు. అది సరే.. కేసీఆర్ సర్కారు మాత్రం ఆ అట్టర్‌ ఫ్లాప్ అయిడియానే మళ్లీ ప్రయోగించాలని భావిస్తుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: