ఎంపీ రఘురమ కృష్ణం రాజు.. ఈయన గెలిచింది వైసీపీ గుర్తుపైనే.. కానీ.. ప్రస్తుతం ఈయన పోరాడేది కూడా వైసీపీ పైనే.. అదే విచిత్రం.. అయితే.. అందుకు కారణాలు అనేకం.. జగన్‌ వైఖరితో మొదట్లోనే పొసగని ఎంపీ రఘురమ కృష్ణం రాజు గెలిచిన కొన్ని నెలల నుంచే స్వరం మార్చేశారు.. అయితే.. ఆయన ఆగర్భ శ్రీమంతుడు.. వందల కోట్లకు అధిపతి.. ఆయనకు రాజకీయాలు పూర్తిస్థాయి వ్యాపకమూ కాదు. కానీ.. ప్రెస్టీజ్‌ ఇష్యూ.. అందుకే.. గొడవ వస్తే జగన్‌నైనా వదలను అనేది ఆయన పాలసీ.


ఒక్కసారి జగన్‌తో చెడిన తర్వాత ఇక సమరానికి సిద్ధపడిపోయారు ఎంపీ రఘురమ కృష్ణం రాజు.. ఆ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. జగన్ పరిపాలనపై ఆయన చేసినన్ని విమర్శలు కనీసం టీడీపీ నాయకులు కూడా చేయలేదని చెప్పొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. టీడీపీ నేతలు ఇప్పుడు ఎంపీ రఘురమ కృష్ణం రాజును చూసి నేర్చుకోవాలి.. ఎందుకంటే.. ఎంపీ రఘురమ కృష్ణం రాజు ఊరికే ఆరోపణలు చేయరు.. ఆయన చేసే ఆరోపణల వెనుక చాలా నిజాలు ఉంటాయి. జగన్ అంటే పడదు కాబట్టి ఆయన ఆ విషయాలు బయటపెడుతున్నా.. వాటిలో పాయింట్ ఎంత వరకూ ఉందనేది కూడా ముఖ్యమే కదా.


ప్రస్తుతం టీడీపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను జగన్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేశాడు.. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే.. అసలు టీడీపీ ఉంటుందా అన్నది కూడా సందేహమే. ఇలాంటి కీలక పరిస్థితుల్లో టీడీపీ నేతలు సర్వస్వం ఒడ్డి పోరాడాలి. అలాగైతేనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై భరోసా ఉంటుంది. ఇప్పటికే జగన్ పాలన సగం పూర్తయింది. ఇంకో రెండున్నరేళ్ల పాలన ఉంది. ఇప్పటి వరకూ సాగిన జగన్ పాలనలో లోపాలను ఎంపీ రఘురమ కృష్ణంరాజు రేంజ్‌లో టీడీపీ నేతలు ఎండగడితేనే ప్రజల్లో ఏమైనా కదలిక వస్తుంది.


అందుకే ఎంపీ రఘురమ కృష్ణం రాజును టీడీపీ నేతలు చాలా నేర్చుకోవాల్సి ఉంది. నిరంతరం ప్రజలను చైతన్యపరచాలి. జగన్ సర్కారు లోపాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. రఘురామ తరహాలో నిత్యం పోరాడాలి. అదే ఇప్పుడు టీడీపీలో కరవైంది. అదే ఇప్పుడు టీడీపీ నేతలు నేర్చుకోవాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: