కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఇక్క‌డ నుంచి మంత్రి కొడాలినాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న వ‌రుస విజ‌యాల‌తో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ్య‌వ‌స్థాగతంగానే కాకుండా.. వ్య‌క్తిగ‌తం గా కూడా కొడాలి నాని దూకుడుగా ఉన్నారు. ఇలాంటి చోట‌.. టీడీపీ స‌త్తా చూపించేనా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా..విజ‌యం ద‌క్కించుకుంటుందా? అనేది చ‌ర్చ‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుంచి దేవినేని అవినాష్‌ను బ‌రిలో నిల‌బెట్టారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. క‌నీసం కూడా పోటీ ఇవ్వ‌లేక పోయార‌నే వాద‌న వినిపించింది.

పైగా.. దేవినేని ఇక్క‌డ పార్టీ బ‌లోపేతం కాకుండా.. వైసీపీలోకి జంప్ చేశారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు టీడీపీ ఎవ‌రికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తుంది?  ఎలా ముందుకు సాగుతుంది? అనే చ‌ర్చ వ‌స్తోంది. ఇత‌ర నియోజ‌క‌వర్గాల కు.. గుడివాడ‌కు తేడా ఉంది. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను ఎన్నిక‌ల‌కు ముందు నిల‌బెట్టినా.. వ‌ర్క వుట్ అవుతుంది. కానీ, గుడివాడ‌లో అలా కాదు. బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మంత్రి కొడాల‌ని త‌ట్టుకుని  స‌త్తా చాటే నాయ‌కుడు కావాలి. ``కొడాలిని మించిన నాయ‌కుడు దొరికాడు!`` అనుకునే నాయ‌కులు కావాలి. ఇలా చేయ‌క‌పోతే.. మ‌ళ్లీ.. టీడీపీకి చ‌చ్చు ఫ‌లిత‌మే ద‌క్కుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో గుడివాడ‌లో ఎవరిని నిల‌బెడితే.. టీడీపీ స‌క్సెస్ అవుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క ప్రకారం.. నానిపై పైచేయి సాధించాలంటే.నంద‌మూరి బాల‌య్య‌ను నిల‌బెట్టాల‌ని ఇక్క‌డి వారు సూచిస్తున్నారు. త‌న తండ్రి, పార్టీ వ్య‌వ‌స్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావ‌డం.. బాల‌య్య కూడా ఫైర్ బ్రాండే కావ‌డం.. వీటికితోడు ఎన్టీఆర్ త‌న‌యుడు అనే సెంటిమెంటు కూడా ఏర్ప‌డుతుంద‌ని.. బాల‌య్యే  నేరుగా లైన్‌లోకి వ‌స్తే.. నాని దూకుడు కూడా త‌గ్గుతుంద‌ని.. అంటున్నారు.

పోనీ.. బాల‌య్య‌ను ఒప్పించ‌లేక పోయినా.. నంద‌మూరి ఫ్యామిలీలో ఎవ‌రికైనా టికెట్ ఇచ్చినా స‌క్సెస్ అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత సాహ‌సం.. ఎవ‌రు చేస్తారు...ఎవ‌రు నిల‌బ‌డ‌తారు? అనేది ప్ర‌స్తుతానికి చ‌ర్చ‌గానే ఉంది. ఏదేమైనా.. అప్ప‌టికప్పుడు కాకుండా.. క‌నీసం ఏడాది ముందుగానే అయినా.. అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: