ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు జగన్‌పై మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ సర్కారుపై అనేక విషయాల్లో కోర్టుకు వెళ్లిన ఆయన ఇప్పుడు ఇంకో అంశంపై కోర్టుకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లోని పత్రాలపై సీఎం బొమ్మ ముద్రిస్తున్న విషయంపై ఆయన అభ్యంతరం చెబుతున్నారు. ఈ విషయంలో తాను కోర్టుకు వెళ్తానంటున్నారు. ఉదాహరణగా భూముల రీ సర్వే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. 



మన సొంత భూములపై సర్వే చేసినందుకు సీఎం బొమ్మ ఎందుకు ముద్రిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలా అధికారిక పత్రాలపై సీఎంల బొమ్మలు ముద్రించడం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ప్రతి పథకంపైనా సీఎం బొమ్మ చూడలేక పోతున్నామని.. ప్రజలంతా ఆ బొమ్మ ఉండాలని కోరుకుంటున్నారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. బొమ్మ ముద్రణ ఆగిపోక తప్పదన్న ఆయన దానికి తానే ప్రయత్నం చేస్తానంటున్నారు. 



ఇటీవల కాలంలో జగన్ సర్కారు ప్రతి పథకంపైనా సీఎం జగన్ బొమ్మను ముద్రిస్తున్నారు. అయితే.. సంక్షేమ పథకాల విషయం వరకూ కొంత అంగీకరించవచ్చు కానీ.. వ్యక్తిగత ఆస్తుల పత్రాలపై కూడా సీఎం బొమ్మ ముద్రించడం ఏంటన్న వాదన వస్తోంది. ఇప్పుడు ఇదే అంశాన్ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రతి ప్రభుత్వ పత్రంపై సీఎం బొమ్మ ఉండి తీరాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 



ఈ అంశంపై కోర్టుకు వెళ్తే.. సహజంగానే కోర్టు నుంచి ప్రభుత్వానికి అక్షింతలు పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల ఏపీలో ప్రతి ప్రభుత్వ పథకానికి జగన్‌ పేరు పెట్టడం కూడా ఓ అలవాటుగా మారిపోయింది. ప్రతి పథకం కూడా జగనన్న అన్నే పేరుతోనే మొదలవుతోంది. ఇది కూడా అతి అవుతుందోదన్న వాదన వినిపిస్తోంది. గతంలోనూ ప్రభుత్వ పథకాలకు సీఎంల పేర్లు పెట్టిన ఉదా హరణలు ఉన్నా.. మరీ ఇంత ఎక్కువగా ఎవరూ పెట్టకోలే దన్న విషయం తరచూ ప్రస్తావనకు వస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr