ఇది ఒకింత టీడీపీని ఆలోచ‌న‌లో ప‌డేసే విష‌యమే! ఎందుకంటే.. అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌ట్టుకోల్పోవ‌డానికి కార‌ణాలు తాజాగా వెలుగు చూశాయి. ప్ర‌స్తుతం మంత్రి కొడాలి నానికి సంబం ధించి కె-క‌న్వెన్ష‌న్లో జూదం నిర్వ‌హించార‌ని.. ఇది రాష్ట్రానికి మంచి ది కాద‌ని ఆరోపిస్తూ.. టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి మ‌రీ .. నిజ‌నిర్ధార‌ణ అం టూ.. హ‌ల్చ‌ల్ చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు కీల‌క నేత‌లు రంగంలోకి దిగారు. అయితే.. ఇంత జ‌రిగినా.. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఏం చేస్తున్నార‌నేది ప్ర‌శ్న‌.

నిజానికి త‌మ‌నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఆడ‌గాల‌పై.. టీడీపీ గుడివాడ నేత‌లు స్పందించాలి. దీనికి సంబంధించిన అంశాల‌ను వారే అధిష్టానానికి చేర‌వేయాలి. అదేస‌మ‌యంలో ముందుగా వారే నిర‌స‌న గ‌ళం వినిపించాలి. కానీ,ఇవేవీ జ‌ర‌గ‌లేదు. టీడీపీ అనుకూల మీడియా బ‌య‌ట పెట్టే వ‌ర‌కు టీడీపీ అధినేత  చంద్ర‌బాబు స్పందించే వ‌ర‌కు స్థానిక నేత‌లు ఎవ‌రూ ముందుకు రాలేదు. పైగా నిజ‌న‌నిర్ధార‌ణ క‌మిటీలో స్థానిక నేత‌ల‌కు చంద్ర‌బాబు చోటు క‌ల్పించ‌లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మనిస్తే.. ఇక్క‌డ పార్టీ ఎంత వీక్‌గా ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌క‌లు..

గ‌డిచిన నాలుగు ఎన్నిక‌లుగా.. ఇక్క‌డ కొడాలి నాని విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. కీల‌క నేత‌ల‌కు చంద్ర‌బాబు టికెట్లు ఇస్తున్నా.. ఎవ‌రూ దూకుడు చూపించ‌లేక పోతున్నారు. పైగా.. మాకెందుకులే అని త‌ప్పుకొంటున్నారు. దీనికి సంబంధించి ఒక ఆన్‌లైన్ మీడియా లోతుగా ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ టీడీపీ నేత‌లు... కొడాలి నానితో అంట‌కాగుతున్నార‌నే విష‌యం వెలుగు చూసింది. గ‌త ఎన్నిక‌ల్లోనూ..కొడాలికి అనుకూలంగా ప‌నిచేశార‌ని.. త‌మ‌కు టికెట్ ఇవ్వ‌కుండా... విజ‌యవాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకువ‌చ్చార‌నే ఆగ్ర‌హంతో ఆ ప‌నిచేశార‌ని తెలిసింది.

అంతేకాదు. కొడాలి నానితో క‌లిసి కొన్ని వ్యాపారాల్లోనూ టీడీపీ నేత‌లు పాలు పంచుకుంటున్నార‌ని.. అందుకే ఇక్క‌డ టీడీపీని ఎద‌గ‌కుండా.. సొంద‌త పార్టీనేత‌లే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. ఇదే ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా సాగితే.. టీడీపీకి మ‌రో సారి ఎలాంటి నేత‌ను నిల‌బెట్టినా.. ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని అంచ‌నావేస్తున్నారు.మ రి ఈ విష‌యాలు చంద్ర‌బాబుకు తెలుసో లేదో కానీ.. ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. పార్టీ అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: