రాష్ట్రంలో కాపు ఉద్య‌మం మ‌ళ్లీ ప్రారంభం కానుందా? చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో రాష్ట్రంలో 2015-17 మ‌ధ్య ఉవ్వెత్తున ఎగ‌సిన కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం.. అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఉద్య‌మానికి కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వం వ‌హించ‌డం.. అప్పటి రాజ‌కీయ నేప‌థ్యంలో ఇది తీవ్ర వివాదానికి దారితీయ‌డం.. ఇలా కాప‌పు ఉద్య‌మం సుమారు. రెండు సంవ‌త్స‌రాల‌కుపైగానే రాష్ట్రంలో కాపు ఉద్య‌మం జోరుగా సాగింది. అయితే... చంద్ర‌బాబు వారికి అనుకున్న విధంగా న్యాయం చేయాల‌ని భావించారు.

ఈ క్ర‌మంలోనే బీసీల‌కు ఆవ‌ల‌.. 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేసి..కేంద్రానికి పంపించారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో కాపుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకున్నారు.కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం దీనిని ఆమోదించ‌లేదు. ఇక‌, త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు.. మోడీ ప్ర‌భుత్వం ఆర్థికంగా వెనుక బ‌డిన‌పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. దీనిని చంద్ర‌బాబు కాపుల‌కు వ‌ర్తింప జేస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

మొత్తం 10శాతంలో 5శాతం కాపుల‌కు వ‌ర్తించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. జ‌గ‌న్ స‌ర్కారు వచ్చిన త‌ర్వాత‌.. దీనిని అమ‌లు చేయ‌డం లేదు. అంతే కాకుండా చంద్ర‌బాబు హ‌యాంలో కాపుల‌కు ఇచ్చిన 5 శాతం రిజ‌ర్వేష‌న్ కూడా ర‌ద్దు చేసేసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాపులు మ‌రోసారి ఉద్య‌మించేందుకు రెడీ అవుతున్నారు. కాపు కార్పొరేష‌న్ ద్వారా రుణాలుఇవ్వ‌డం లేదని.. విదేశీ విద్యా ప‌థ‌కం నిలిపివేశార‌ని.. కాపులు ఆరోపిస్తున్నారు.. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ స‌ర్కారుపై ఉద్య‌మించాల‌ని .. నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు.

తాజాగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన కాపు స‌మావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త కాపు ఉద్య‌మంలో గంటా దూరంగా ఉన్నారు.కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న యాక్టివ్ అయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సో.. దీనిని బ‌ట్టి.. కాపు ఉద్య‌మం తీరు తెన్నులు.. ఈ ద‌పా రాజ‌కీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: