ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు సంక్షేమమే ప్రధానంగా పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉచిత విద్య, విద్యాసదుపాయాలు అందిస్తున్నారు. ప్రత్యేకించి పాఠశాలలపై దృష్టి సారించిన జగన్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా మంచి చదువు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక బహుమతులు కూడా ఇస్తున్నారు.


జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు మొదలు పెట్టిన పనులు ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయి.  రెండేళ్లలో ఏపీ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఏకంగా 13లక్షల మంది విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయట. అయితే.. ఇందుకు కారణంగా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం, అలాగే అన్ని స్కూళ్లలోని విద్యార్దులకు వివిధ స్కీములు అమలు చేయడం.. ఇదీ ఆయన తీసుకున్న నిర్ణయాలు.


విద్యారంగం విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలు అందిస్తోందని నివేదకుల చెబుతున్నాయి. విద్యారంగానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాల వల్లే అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని భావించారు. గతంలోని పాఠశాలలు అడ్మిషన్లు తగ్గిపోయి, డ్రాపౌట్లు పెరిగిపోయిన చెబుతున్నారు.


దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ లో.. పాఠశాలల అడ్మిషన్లలో కొత్త మార్పులు వచ్చాయి. ఇటీవల విడుదలైన సామాజిక–ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అంటే.. 2018–19లో విద్యార్థుల సంఖ్య 70,43,071 మాత్రమే. కానీ ఇప్పుడు 2020–21 నాటికి ఆ సంఖ్య 83,76,020కి చేరిపోయింది.. అంటే.. రెండేళ్లకే 13,32,949 మంది పిల్లల కొత్తగా చేరారన్నమాట. షాకంగ్ ఏంటంటే.. 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతలా చేరికలు ఏనాడూ లేవట. 2000–01 విషయానికి వస్తే.. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం చేరికల సంఖ్య 75,01,162 మాత్రమేనట. మొత్తానికి ఈ లెక్కలు చెబుతున్నదేంటంటే.. జగన్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థలు బాగుపడ్డాయని.. అవునా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: