పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో నరసాపురం అసెంబ్లీ కూడా ఒకటి..మొదట నుంచి నియోజకవర్గంలో టీడీపీ హవా కొనసాగుతుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి చూస్తే ఇక్క‌డ మాజీ హోం మంత్రి చేగొండి హ‌రిరామ జోగ‌య్య‌తో పాటు కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు గెలిచారు. కొత్త‌ప‌ల్లి అయితే ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌ని చేశారు. 2004లో కూడా ఆయ‌న ఇక్క‌డ గెలిచారు. ఇంకా చెప్పాలంటే కొత్త‌ప‌ల్లి 2009లో పార్టీ మారే వ‌ర‌కు న‌ర‌సాపురం టీడీపీకి పెట్ట‌ని కోట‌.

అయితే 2009 నుంచి నరసాపురంలో సీన్ మారిపోయింది. కేవలం మెగా ఫ్యామిలీ మీద బేస్ అయ్యి ఇక్కడ గెలుపోటములు వస్తున్నాయి. అది వేరే పార్టీల గెలుపుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం వల్ల...అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ప్ర‌సాద‌రాజు తొలిసారి 20 వేల పైచిలుకు భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2014లో పవన్ కల్యాణ్, టీడీపీకి సపోర్ట్ చేయడంతో... నరసాపురంలో టీడీపీ విజయం సాధించింది. ఊరూ పేరు లేని బండారు మాధ‌వ‌నాయుడు కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుపై ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

కానీ 2019లో జనసేన విడిగా పోటీ చేయడంతో, మళ్ళీ ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచింది. కాకపోతే ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ మొత్తం జనసేనకు వెళ్లిపోయింది. అందుకే గత ఎన్నికల్లో నరసాపురంలో జనసేనకు సెకండ్ ప్లేస్ వచ్చింది. అసలు వైసీపీ-జనసేన పార్టీల మధ్యే ఫైట్ జరిగింది. ఇక్క‌డ టీడీపీ ట్ర‌యాంగిల్ ఫైట్‌లో రెండు సార్లు డిపాజిట్ రాలేదు. 2012 ఉప ఎన్నిక‌ల్లోనూ, గ‌త ఎన్నిక‌ల్లోనూ అదే ప‌రిస్థితి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 55 వేల ఓట్లు వరకు రాగా, జనసేనకు 49 వేల ఓట్ల వరకు వచ్చాయి...ఇక టీడీపీకి మాత్రం 27 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే ఇక్కడ టీడీపీకి మూడో స్థానమే ద‌క్కింది.

ఈ మూడో స్థానం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు, అసలు టీడీపీ జెండా కనిపించే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానికి పలు కారణాలు ఉన్నాయి...అసలు ఇక్కడ వైసీపీ-జనసేనల మధ్యే పోరు జరుగుతుంది..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటే..ఖచ్చితంగా ఈ సీటు జనసేనకే దక్కుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. టీడీపీకి అసలు సీటు రాదు.

ప్ర‌స్తుతానికి పొత్తూరు రామ‌రాజును తాత్కాలికంగా ఇన్‌చార్జ్‌గా పెట్టి టీడీపీ బండి న‌డిపిస్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒకవేళ పొత్తు లేకుంటే విడివిడిగా పోటీ చేయాల్సి వ‌స్తే....అప్పుడు వైసీపీ-జనసేనల మధ్యే ఫైట్ ఉంటుంది. టీడీపీ మూడో స్థానంలోనే ఉంటుంది. ఇందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. అంటే ఎటు చూసుకున్న నరసాపురంలో ఇంకా టీడీపీ జెండా కనిపించేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: