గుడివాడ కెళ్లాను... ఆ పాట గుర్తుందా మీకు. ఇటీవలే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాటి ఎన్.టి.ఆర్ చిత్ర గీతాన్ని గుర్తు చేశారు.  ఇటీవలి కాలంలో అంటే సంక్రాంతి సంబరాల తరువాత మీడియా జనానికి మంచి వార్తల సరుకును ఇచ్చిన  కేంద్రం గుడివాడ. ఇది ఎవరూ కాదన లేని సత్యం. ఏ టీవి ఛానల్ ఓపన్ చేసినా, ఏ వార్తా పత్రిక తెరచి చూసినా అందులో గుడివాడ  గురించిన వార్త తప్పక కనిపించింది. గుడివాడ శాసన సభ్యుడైన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నానీ, తెలుగదేశం పార్టీ నేతేలు బుద్దా వెంకన్న, వర్ల రామయ్య తదితరులు ఈ వారం రోజులుగా  మీడియా మిత్రులు కనిపిస్తే చాలు రెచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే నీచాతి నీచంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు కుక్క అంటే.. నీవే కుక్క అని అరుచుకున్నారు. ఇది మేము రాయగలిగిన సింపుల్ వర్డ్స్ మాత్రమే. వాళ్లు మాట్లాడిన మాటలు, విసురుకున్న విసుర్లు, సవాళ్లు అన్నీ ఇక్కడ రాయడం కుదరదు. ఎందుకంటే మీడియా వ్యవస్థలో భాగమైన మాకు కొంత నిబద్ధత ఉంది. మాకంటూ కొన్ని పరిమితులున్నాయి. మాకు మేమే గీచుకున్న నియంత్రణ రేఖలున్నాయి. వాటిని మేము ఎన్నడూ దాటం. ఇక అసలు విషయానికి వద్దాం.

తెలుగు మీడియాలో ప్రముఖంగా  ప్రజల నాడిని వినిపించే ఛానళ్లలో టివి 9 కూడా ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల అరోపణలు, ప్రత్యారోపణల పై విసిగి పోయిందో ఏమో. ఆ ఇద్దరినీ  అంటే మంత్రి కొడాలి నాని, టిడిపి నేత వెంకన్నలను ఒకే సారి మాట్లాడించింది. ఓ విధంగా కాంప్ర‌మైజా చేసింది. ఇంతటితో ఈ గలాట ఆగుతుందా ? మరోసారి మరో వేదిక ముందు వీరిద్దరూ మరలామరలా రెచ్చి పోతారా ? అన్నది అంతపట్టని శేష ప్రశ్నే. మృదుభాషిత్వం, ప్రియ భాషిత్వం,  పత్రికా పరిభాష, పార్లమెంటరీ వర్డ్స్, వీటికి అర్దాలే మారిపో యాయా ? అన్న ప్రశ్న విజ్ఞలలో నిరంతరంగా సంచరిస్తూ ఉంది. పలుక వలెను మాట పరులకు హితముగా అన్న లోకోక్తిని గుర్తుచేసుకుంటూ...




మరింత సమాచారం తెలుసుకోండి: