రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఏకంగా గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడుగా.. మ‌రో 13 కొత్త జిల్లాల‌ను ప్ర‌తిపాదించింది. వాస్త‌వానికి ప్ర‌తిపార్ల‌మెంటు నియో జ‌క‌వ‌ర్గాన్నీ.. ఒక జిల్లాగా ప్ర‌తిపాదిస్తామ‌న్న మేర‌కు.. 25 జిల్లాలు ఉండాలి. అయితే.. ఇప్పుడు మ‌రో జిల్లా అద‌నంగా వ‌చ్చి చేరింది. అదే అర‌కు.. పార్ల‌మెంటుస్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించింది. ఇక‌, ఎన్టీ ఆర్‌, సీతారామ‌రాజు వంటి పేర్ల‌ను జిల్లాల‌కు పెట్టింది. ఇది నిజంగానే సంచ‌ల‌న విష‌యం.

అయితే.. అనుకున్న విధంగా జిల్లాల ఏర్పాటు సాగుతుందా?  నోటిఫికేష‌న్ అయితే..ఇచ్చారు. కానీ, దీనిని ముందు కు తీసుకువెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. జిల్లాల ఏర్పాటు.. అంత ఈజీకాదు.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌భుత్వానికి ఇవి గుదిబండ‌గా మార‌నున్నాయి. అయితే.. రాజ‌కీయంగా మాత్రం అనూ హ్యమైన ఫ‌లితం.. వైసీపీకి సొంత అవుతుంద‌ని అంటున్నారు.

ఎప్ప‌టి నుంచో ఉన్న డిమాండ్ల మేర‌కు జిల్లాల ఏర్పాటు చేయాల‌ని గ‌తంలోనే చంద్ర‌బాబు భావించారు.అ యితే.. ఇది ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నికావ‌డం.. పైగా.. రాజ‌ధానిపై నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డంతో దీనిని సాధ్యం చేయ‌డంపై ఆయ‌న ఫోక‌స్ పెట్ట‌లేదు. ఇది, ఇప్ప‌డు వైసీపీకి అనుకూలంగా మారింది. రాజ‌కీయంగా ఆ పార్టీ పుంజుకునేందుకు  ఈ జిల్లాల ఏర్పాటు ఖ‌చ్చితంగా తోడ్ప‌డుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు అదే స‌మ‌యంలో స‌స‌మ్య‌లు కూడా వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న‌తో రాజ‌కీయంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి జ‌గ‌న్ వీటిపై దృష్టి పెట్టారో లేదో తెలియ‌డం లేదు. అభివృద్ధిపైనా ఫోక‌స్ పెంచాలి. కేవ‌లం ప‌న్నుల పెంపు కోస‌మే.. ఇలా ఆర్థిక తోడ్పాడు కోసం..జిల్లాల విభ‌జ‌న జ‌రిగింద‌నే వాద‌న‌ను ప్ర‌భుత్వం బ‌లంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో ఉద్యోగుల ఉద్య‌మాన్ని నీరు గార్చేందుకు ప్ర‌భుత్వం ఆగ‌మేఘాల‌పై ఇలా నిర్ణ‌యించింద‌నే  వాద‌న‌కు కూడా కౌంట‌ర్ ఇవ్వాలి. ఇక‌,కేంద్రం అనుమ‌తి కూడా త‌ప్పదు. ఇలా.. అన్ని కోణాల్లోనూ ప్ర‌భుత్వం ప్రాథ‌మిక ఇబ్బందుల‌ను దాటితేనే.. ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: