మాట తప్పని, మడమ తిప్పని నేతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాలలో తన మిత్రుడు, మంత్రి వర్గ సహచరుడు కొడాలి నానీ కోర్కోను తీర్చారు. అంతే కాదు ఆయన సామాజిక వర్గాన్ని కూడా సంతోష పరిచారు. ఇంతకీ ఆ కోర్కె ఏమిటే తెలుసా ?
ఏప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చ జెండా ఊపింది.  ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో ఇరవైఆరు జిల్లాలు ఏర్పాటుకు ముసాయిదా తీర్మానాన్ని మంత్రి వర్గం ఆమోదించింది. వీటలో ప్రధానంగా పేర్కోన దగినది ఎన్టీఆర్ జిల్లా. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన నందమూరి తారక రామారావు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని కొడాలి నానీ అప్పట్లో వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కోరారు. నానీ సూచన మేరకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఎన్టీఆర్  పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.  ఆ హామీతో ఎన్నికల ముందుకు వెళ్లి విజయబావుటా ఎగుర వేసింది.
ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం కావడంతో ముసాయిదా తీర్మానంలో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడ లోక సభ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజక వర్గాలు మూడింటితో పాటు,  తిరువూరు, జగ్గయ్యపేట,  నందిగామ, మైలవరం నియోజక వర్గాలతో కలిపి ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు కానుంది. ఈ జిల్లా పరిధిలో మొత్తం 20 మండలాలుంటాయి. ఇరవై రెండు లక్షల పై చిలుకు జనాభాతో3,316 కి.మీ విస్తీర్ణంలో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా కేంద్రం విజయవాడగా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు  ప్రస్తుతం పామర్రు నియోజక వర్గంలో ఉంది. ఈ నియోజక వర్గం మచిలీ పట్నం కేంద్రంగా నడిచే కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆ జిల్లా పేరును అలాగే ఉంచేసి, కొత్తగా ఏర్పాటు చేస్తున్న విజయవాడ పార్లమెంట్ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించింది.  అవసరార్దాలు ఎలా ఉన్నా... సినీ రంగంలో తన కంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుని, రాజకీయాలలో ప్రవేశించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన దివంగత నేత ఎన్టీఆర్ కు పేరుతో జల్లా ఏర్పాటు కానుండటం కొడాలి నానీకి, ఆయన సామాజిక వర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగించే చర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: