ప్రధాన మంత్రి పదవి.. ఈ దేశంలోని సగటు రాజకీయ నాయకుడు కూడా ఆశపడే పదవి.. ఈ దేశాన్ని ఏలాలని ఏ నాయకుడికి ఉండదు.. కానీ.. అది దక్కే అవకాశం మాత్రం అతి తక్కువ మందికి వస్తుంది. అందులోనూ జాతీయ పార్టీ నాయకులకే ఆ అవకాశం, అదృష్టం ఎక్కువ.. ఇప్పుడు ఇండియాలో ప్రధాని పదవికి పోటీ వచ్చే నేతలు ఎంతమంది అని లెక్కేస్తే.. ముందుగా వినిపించే వారు మళ్లీ నరేంద్ర మోడీయే.. అవును.. ఇప్పట్లో ఆయనకు దీటుగా ప్రజాభిమానం ఉన్న నేత మరొకరు కనిపించడం లేదు.


అయితే.. మన ఇండియాలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదు.. దేశాధినేతను నేరుగా ప్రజలు ఎన్నుకోరు.. మనది పరోక్ష ప్రజాస్వామ్యం.. జనం ఎంపీలను ఎన్నుకుంటే.. ఆ ఎంపీలు ప్రధానిని ఎన్నుకుంటారు. ఇక ఇప్పటి పరిస్థితులను  బట్టి చూస్తే.. మోడీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశాలున్న నేతగా రాహుల్ గాంధీనే చెప్పుకోవచ్చు. బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న పార్టీ అదొక్కటే కదా మరి. మరి మోడీ, రాహుల్ కాకుండా ఇంకా ప్రధాని కావాలని ఎందరు ఆశపడుతున్నారో ఇప్పుడు చూద్దాం..


ఈ జాబితాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు వరుసలో ఉంటారు. మోడీని ఎదిరంచడంలో ముందుండే మమతా బెనర్జీకి ఈ దేశానికి ప్రధాని కావాలన్న కోరిక ఉంది. అందుకే ఆమె తన పార్టీని ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తున్నారు. మమతా బెనర్జీ తర్వాత ప్రధాని రేసులో వినిపించే పేరు నితీశ్ కుమార్‌ దిగా చెప్పుకోవచ్చు.. ఆయనతో పాటు శరద్ పవార్ కూడా ఎప్పటి నుంచో ప్రధాని రేసులో ఉన్నారు. అయితే.. నితీశ్ అయినా శరద్ పవార్ అయినా లాలూ అయినా అంతా ప్రాంతీయ పార్టీ నేతలే.. వీరు ప్రధాని కావాలంటే కూటమి కట్టాల్సిందే.


ఇప్పుడు ఈ ప్రధాని పదవి రేసులోకి మన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వచ్చేశారు. ఆ తర్వాత శివసేన సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ప్రధాని రేసులో ఉన్నారని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇక ఈ పదవిపై అరవింద్ కేజ్రీవాల్‌ కు కూడా ఆశ ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మోడీ ఘోరంగా ఓడిపోతే.. మరి వీరిలో ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి దక్కుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

pm