తెలంగాణలో బీహార్ రాజ్యం నడుస్తోందా.. తెలంగాణ ప్రభుత్వంలో బీహార్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారా.. ప్రత్యేకించి బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారా.. తెలంగాణలోని కీలక శాఖలన్నిటినీ కేవలం బీహార్ కు చెందిన అధికారులకే అప్పగిస్తున్నారా.. ఈ ప్రశ్నలన్నింటినికీ అవుననే అంటున్నారు తెలంగాణ ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి. ఇందుకు ఆయన కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.


బీహార్‌కు చెందిన అనేక మంది అధికారులకు అర్హతలేకపోయినా కలెక్టర్, ఎస్పీలుగా నియమించారని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో బిహార్‌ వారే అధికంగా ఉన్నారని.. ఆరోపించారు. అంతే కాదు.. ఏకంగా కేవలం ఐదుగురు బిహార్ అధికారులకు 40 శాఖలు ఇచ్చేశారని  రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేశ్‌ కుమార్, అంజనీ కుమార్ కీలక శాఖలు ఇచ్చారని.. కేసీఆర్‌కు కృతజ్ఞతగా బీహార్‌ అధికారులులు ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని రేవంత్‌ రెడ్డి అంటున్నారు.


ఇక సోమేశ్ కుమార్ సర్వీస్‌ రికార్డు విషయంలోనూ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసారు. సోమేశ్ కుమార్ సర్వీస్‌ రికార్డుల గురించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని.. దీని గురించి రెండేళ్లుగా అడుగుతున్నా సోమేశ్‌ కుమార్ సర్వీస్ రికార్డు ఇవ్వట్లేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి విమర్శలను బట్టి చూస్తే తెలంగాణలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తుందా అన్న అనుమానం కలుగక మానదు.


అయితే.. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు కేంద్ర క్యాడర్ కు చెందిన వారు.. అలాంటి వారి విషయంలోనూ రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మరి రేవంత్ రెడ్డి చేసే ఈ ఆరోపణలు నిజమా కాదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రత్యేకించి బీహర్ రాష్ట్రానికి చెందిన అధికారులపై కేసీఆర్ ఎందుకు ప్రేమ పెంచుకుంటారు.. ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన అధికారులపైనే ఎందుకు ఈ ప్రేమ అన్నదానికి మాత్రం రేవంత్ రెడ్డి కూడా సరైన కారణం చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: