జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేందుకు పార్టీ నాయ‌కులు తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. వీరిలో చా లా మంది పార్టీ త‌ర‌ఫున వాయిస్ బ‌లంగా వినిపిస్తున్నారు. అయితే.. ప్ర‌స్తుతం మారిన జిల్లాల స్వ‌రూపంతో వీరి ఆశ‌లు ఏమేర‌కు తీరుతాయ‌నేది ఆస‌క్తిగా మారింది. ఇలాంటి వారిలో కృష్ణాజిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు.. ఇటీవ‌ల‌కాలంలో ఫైర్‌బ్రాండ్ మాదిరిగా రాజ‌కీయాలు చేస్తున్న పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం జిల్లాల విభ‌జ‌న‌ను ముందు చేసి.. త‌ర్వాతే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తార‌నేది సుస్ప‌ష్టంగా తేలిపోయింది.

ఈ క్ర‌మంలో కృష్నా జిల్లాను రెండుగా విభ‌జిస్తే.. కృష్ణాజిల్లాలోని గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గాల‌తో మ‌చిలీప‌ట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు.  అదేవిధంగా విజయవాడ పశ్చిమ, సెంట్ర‌ల్‌, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇదే జ‌రిగితే.. ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న కొడాలి నాని (గుడివాడ‌), పేర్ని నాని (మ‌చిలీప‌ట్నం)లు కృష్ణాజిల్లా ప‌రిధిలోకి వ‌స్తారు.

అదే స‌మ‌యంలో జోగి ర‌మేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ పెడ‌న కూడా కృష్ణా జిల్లా ప‌రిధిలోకే వ‌స్తుంది. ఇక‌, ఇప్పుడున్న ఇద్ద‌రు నానీల‌లో ఒక‌రిని ఖ‌చ్చితంగా కొన‌సాగించ‌నున్నారు. దీంతో ఒక జిల్లా నుంచి ఒక్క‌రే మంత్రి అనే కాన్సెప్టును అమ‌లు చేస్తే.. కొత్త‌గా మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న జోగికి నిరాశ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. నిజానికి ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. జిల్లాలో నానీలే కీల‌క‌పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో వారిని పూర్తిగా ప‌క్క‌న పెట్టే సాహ‌సం చేసే అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

జ‌గ‌న్ ఎన్ని మార్పులు చేసినా క‌మ్మ కోటాలో కొడాలి నానిని కొన‌సాగించాల‌ని అనుకుంటే జోగి ర‌మేష్ కు మంత్రి ప‌ద‌వి రాదు. ఇద్ద‌రు నానిలు బ‌లంగా ఉండ‌డంతో జోగి ఆశ‌లు అడియాసలే అయ్యే ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో జోగి ర‌మేష్‌కు మ‌రో కీల‌క ప‌ద‌విని అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి జోగి అదృష్టం ఎలా ? ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: