త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు? 2019లో అనూహ్యంగా సోష ల్ ఇంజ‌నీరింగ్ పేరుతో ఆయ‌న ఎక్క‌వగా సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. దీనివ‌ల్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే.. రెడ్డి రాజ్యం ఏర్ప‌డుతుంద‌ని.. భావించిన వారు.. విమ‌ర్శ‌లు చేసిన వారికి చెప్ప‌క‌నే ఆయ‌న పాఠం చెప్పారు. ఇక‌, ఇప్పుడు కూడా అదే రేంజ్ లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై త‌న‌దైన శైలిలో ముందుకు సాగాల‌ని.. జ‌గ‌న్ నిర్న‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. జ‌గ‌న్ ఏ ప‌థ‌కాన్ని ప్రారంబించినా.. మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా తీససుకుని అమ‌లు చేస్తున్నారు. జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ‌, అమ్మ ఒడి, వైఎస్ ఆర్ భ‌రోసా, జ‌గ‌న‌న్న చేదోడు.. ఇలా ఏ ప‌థ‌కాన్ని తీసుకున్నా.. మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా ఆయ‌న ల‌బ్ధి చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ‌గా ఉన్న మ‌హిళా ఓటు బ్యాంకును జ‌గ‌న్ ఎక్కువ‌గా న‌మ్ముతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు మహిళ‌ల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో ముగ్గురు మహిళా మంత్రులు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో నూ ఇద్ద‌రుఎస్సీలు, ఒక‌రు ఎస్టీ మంత్రి ఉన్నారు. అయితే.. వ‌చ్చే మంత్రి వ‌ర్గంలో వీరిని ప‌క్క‌న పెట్టినా.. ఆయా పోస్టుల‌ను మాత్రం ఆ సామాజిక వ‌ర్గాల‌కే కేటాయిస్తార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు.. బీసీల‌కు ఎక్క‌వుగా ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. అందునా.. బీసీ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు.

ర‌మార‌మి తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్న దాని ప్ర‌కారం.. క‌నీసం 10 మంది వ‌ర‌కు మహిళా నాయ‌కుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌లు స‌హా అనేక రూపాల్లో మ‌హిళ‌ల‌కు 50 శాతం ప‌ద‌వులు ఇచ్చిన ఘ‌నత జ‌గ‌న్ కే ద‌క్కుతోంది. ఈ క్ర‌మంలో మంత్రి వ‌ర్గంలోనూ 50 శాతం ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా మ‌రో చ‌రిత్ర సృష్టించాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: