భారత్‌కు పక్కలో బల్లెంలాంటి దేశం చైనా.. తన పొరుగునే తనను తలదన్నేలా ఎదుగుతున్న భారత్‌ను చూస్తే చైనాకు ఎప్పుడూ కడుపు మంటే.. ఎక్కడ తన ఆధిపత్యానికి గండికొడుతుందో అన్న ఆందోళనతో చైనా ఇండియాను కట్టడి చేసే వ్యూహాలపై ఎప్పుడూ దృష్టి పెడుతూనే ఉంటుంది. అంతే కాదు.. భారత్ చుట్టుపక్కల దేశాలకు అప్పులిస్తూ తనవైపునకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి వాటికి చైనా అప్పులు ఇచ్చి.. తనకు అనుకూలంగా మలచుకుంటోంది.


ఇక ఇప్పుడు మరో అడుగు ముందేకేసి ఏకంగా.. ఓ దేశంలో ఇండియాకు వ్యతిరేకంగా ఉద్యమాన్నే నడిపించే స్థాయికి వెళ్లిపోయింది డ్రాగన్. ఇంతకీ ఆ దేశం ఏంటి అంటారా.. అదే మాల్దీవులు. ఇండియాకు చాలా దగ్గరగా ఉండే దేశం మాల్దీవులు.. ఇవి కొన్ని దీవులు మాత్రమే.. వీటిని గేట్ వే ఆఫ్‌ ఇండియన్ ఓషన్ అని పిలుస్తారు. అలాంటి మాల్దీవులతో ఇండియాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పేరుకు దేశమే అయినా మాల్దీవుల జనాభా కేవలం అయిదున్నర లక్షలు.  ఈ దేశం ప్రధాన ఆదాయం పర్యాటక రంగమే. మాల్దీవులకు అత్యంత సమీపంగా ఉండే పొరుగు దేశం ఇండియానే.


మాల్దీవులకు ఆహార అందించేది ఇండియా నుంచే. మాల్దీవులకు బియ్యం, చక్కెర, చికెన్‌, గుడ్లు, బంగాళదుంప, ఉల్లి వంటి సరకులు ఎక్కువగా మన దేశం నుంచే దిగుమతి చేసుకుంటుంది. మొదటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్న మాల్దీవుల్లో ఇటీవల ఇండియా వ్యతిరేక భావ జాలం పెరుగుతోంది. ఇండియా మాల్దీవుల స్నేహాన్ని చెడగొట్టేలా చైనా కుట్రలు పన్నుతోంది. మాలి తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహణ కోసం మనం రెండు ధ్రువ్‌ హెలికాప్టర్లను కానుకగా ఇచ్చాం.. ఇప్పుడు ఆ హెలికాప్టర్లను కూడా మాలి వెనక్కిఇచ్చింది. ఇటీవల మాలి విమానాశ్రయ ఆధునికీకరణ కాంట్రాక్టును ఇండియన్ కంపెనీ నుంచి తప్పించి చైనా సంస్థకు ఇచ్చారు.


మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ ను తన బుట్టలో వేసుకుని ఇండియా వ్యతిరేక ఉద్యమాలు చేయిస్తోంది. తాజాగా తమ దేశంలో భారత బలగాల మోహరింపు పెరుగుతోందని యమీన్‌, ఆయన మద్దతుదారులు ఉద్యమిస్తున్నారు. భారత్‌ వెళ్ళిపోవాలి అని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఈ కుట్రను భారత్ దీటుగా ఎదుర్కోకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: