ఐఏఎస్‌.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.. దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం ఇదే. ఈ ఉద్యోగం సంపాదించాలని యువత ఎంతో కలలు కంటారు. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతారు. ఎన్నో కష్టాల తర్వాత దీన్ని సాధిస్తారు. లక్షల్లో ఒకరికే ఈ ఛాన్స్ వస్తుంది. అయితే.. ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని దాన్ని అక్రమార్జన కోసం ఉపయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో రాజకీయ నాయకులపైనే విమర్శలు వచ్చేవి.


ఇప్పుడు ఐఏఎస్‌లు రాజకీయ నాయకులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఐఏఎస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ లో ఐఏఎస్ అధికారులు రియలేస్టేట్ వ్యాపారాలు చేస్తూ...కోట్లు గడిస్తూ వారి అధికారాలను మర్చిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాన్ని పాలనను మర్చిపోయి కోట్ల రూపాయలు సంపాదించడమే ధ్యేయంగా పని చేస్తున్నారవి విమర్శించారు.


అధికారం ఉందని ఎస్సి , ఎస్టీ , మైనారిటీ బిడ్డలకు చదువు చెప్పే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధిస్తున్న 950 అధ్యాపకులను , ఉపాధ్యాయులను అకారణంగా తొలగించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడుతున్నారు. ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ లపై ప్రధాని మోదీ , ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ఫిర్యాదు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య  అంటున్నారు.


హైదరాబాద్‌ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో తొలగించిన ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నా లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వారికి మద్దతు తెలిపారు. కృష్ణయ్య విమర్శల్లో న్యాయం లేకపోలేదు. ఇటీవల కొందరు కలెక్టర్లుగా పని చేసిన వారు కూడా చివరకు చిన్న చిన్న రాజకీయ పదవుల కోసం ఆశపడుతున్నారు. సర్వీసు కూడా వదిలేసి రాజకీయాల్లో చేరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ias