మాజీ మంత్రి నారాయణ ఫోన్‌ ట్యాప్ చేశామని ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చారు. తన ఉద్దేశ్యం ఫోన్ టాపింగ్ కాదని.. ఫోన్‌ ట్రాకింగ్ అని వివరణ ఇచ్చారు. తాను పోలీసులు ఫోన్లు  ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పలేదని.. ఫోన్లు  ట్రాకింగ్ చేశారనే చెప్పానని వివరణ ఇచ్చారు. అయితే చెప్పేటప్పడు టంగ్ స్లిప్ అయి ఉండొచ్చని కూడా అన్నారు.


ఫోన్లు  ట్యాపింగ్ చేయడమనేది క్రైం అనేది అందరికీ తెలుసని.. తాను అలా ఎందుకు చెబుతానని అన్నారు. ఏదేమైనా జరిగిన పొరపాటును మంత్రి పెద్దిరెడ్డి హుందాగానే ఒప్పుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తీరుపై ఆయన నిప్పులు చెరిగారు.. రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. చంద్రబాబు వయసుకు తగ్గట్లుగా,ఆలోచనతో  మాట్లాడటం లేదని మండిపడ్డారు.


వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని..  మీటర్లు బిగుస్తే  రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారని.. పారదర్శకత కోసమే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం  మీటర్లు బిగిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అన్నారు. ఈ నెలాఖరలోగా రైతుల పేరిట  అకౌంట్లు ఒపెన్ చేసి అనుసంధానిస్తారని.. వంద శాతం కరెంటు బిల్లు మొత్తాన్ని రైతుల అకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తుందని.. రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్  బిల్లులు కడతారని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  తెలిపారు.


ఈ మీటర్లు సక్సెస్ అయితే  రైతులు తనకు  ఒట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారని.. అందుకే  రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని.. తాను చంద్రబాబు బాషను నేను మాట్లాడలేనని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని.. 14 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా  పని చేసిన చంద్రబాబు ఎక్కడా ప్రాజెక్టు కట్టలేదని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  గుర్తు చేశారు. శ్రీలంకకు ఇక్కడికీ పోలికే లేదని.. చంద్రబాబు మీడియాను వాడుకుని ప్రభుత్వంపై  రాజకీయంగా బురదజల్లుతున్నారని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: