ఏపీ సీఎం ఇవాళ కొందరి ఖాతాల్లో డబ్బు వేయబోతున్నారు. వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ తొలివిడత నిధులు ఇవాళ జగన్ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ అక్కడే ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఏలూరు జిల్లా గణపవరం మండలంలో సీఎం జగన్ వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కార్యక్రమం  పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఏలూరు జిల్లా గణపవరం చేరుకుంటారు.


అక్కడ నుంచి గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వేదిక వద్ద  వైయస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం తర్వాత డిగ్రీ కాలేజీ మైదానంలో బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి చేరుకుంటారు. వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా.. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ను అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడతగా మే లో ఇచ్చే 7వేల 500 లకు గానూ 5వేల 500లను బటన్‌ నొక్కి  రైతుల ఖాతాల్లో జమ చేయచేస్తారు.


ఈ నెల 31న  కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్‌ నిధులు మరో 2వేలు రైతుల ఖాతాల్లో  జమ కానున్నాయి. దీంతో మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 7వేల500 చొప్పున దాదాపు 3,వేల 758 కోట్లు జమ కానున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ ఈ నిధుల విడుదల ద్వారా చెప్పబోతున్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని.. ఇక సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమేనని జగన్ వ్యతిరేక మీడియా జోరుగా కథనాలు ఇస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మాత్రం పథకాల కొనసాగింపుకే గట్టిగా నిర్ణయించుకున్నారు.


ఐతే.. నిధుల లభ్యత విషయంలో మాత్రం సమస్యలు ఉన్నాయి. ఏది ఏమైనా సంక్షేమమే తన మొదటి ప్రయారిటీ అని ఇప్పటికే జగన్ పలుసార్లు తేల్చి చెప్పారు. అందుకే ఎన్నికలలోపు సంక్షేమ పథకాలు ఆగే ప్రసక్తే లేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: