ఏపీ సీఎం జగన్ త్వరలో జపాన్‌లో రోడ్‌ షో నిర్వహించబోతున్నారు. ఇటీవల ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాదితో  జపాన్ కి చెందిన ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ సీఎం జగన్ జపాన్ పర్యటన వివరాలు చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జపాన్ లో రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని జపాన్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తామని సుబ్రహ్మణ్యం జవ్వాది తెలిపారు.


జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తుందని సుబ్రహ్మణ్యం జవ్వాది  అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి కనబరిచారట. అందుకు తగ్గట్లు త్వరలోనే పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలందించే అంశంపై జపాన్ ప్రతినిధులు ప్రధానంగా ఏపీఈడీబీ సీఈవోతో డిస్కస్‌ చేశారట.


యొకొహమ పరిశ్రమ ఆధ్వర్యంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏపీలో నైపుణ్య వనరులకు కొదవ లేదని, స్కిల్ గ్యాప్ ఉన్నచోట పరిశ్రమలు కోరినట్లు ఉచిత శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు కావలసినట్లు ప్రభుత్వమే తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సుబ్రహ్మణ్యం జవ్వాది వివరించారు. జైకా, జెట్రో వంటి జపాన్ సంస్థలతో కలిసి భాగస్వామ్యం ఉందని ఈడీబీ సీఈవో గుర్తు చేశారు.


శ్రీ సిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే ప్రత్యేకంగా  హెల్ప్ డెస్క్ వెసులుబాటుతో కల్పించనుంది. అలాగే శ్రీ సిటీలో జపనీస్ భాష అనువాదకులను కూడా ఏర్పాటు చేస్తారట. కోవిడ్ పరిస్థితులను ఏపీ, భారత్ ఎదుర్కొన్న తీరును  కూడా సుబ్రహ్మణ్యం జవ్వాది తో జపాన్ ప్రతినిధులు చర్చించారు. మరి జగన్ జపాన్ టూర్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: