వైసీపీ పాలనపై టీడీపీ విరుచుకుపడుతోంది. నిన్న రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. రైతులకు తమ సర్కారు చేస్తున్న మేలును ఏకరవు పెట్టారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ జగన్ తీరుపై మండిపడ్డారు. రైతు రాజ్యం తెస్తాన‌ని గ‌ద్దెనెక్కి రైతుల్లేని రాజ్యంగా ఆంధ్రప్రదేశ్‌గా జగన్ రెడ్డి మార్చారని మండిపడ్డారు. జగన్ పాల‌న‌లో రైతుల‌కి జ‌రిగిన అన్యాయం, వ్యవ‌సాయరంగ‌ సంక్షోభం.. వైఎస్సార్ హ‌యాంలో రైతుల‌పై జ‌రిగిన దాష్టీకాల‌కు జగన్ స‌మాధానం ఇవ్వాలంటూ జగన్‌కు 17 ప్రశ్నలు లోకేశ్ సంధించారు.

అవేంటంటే..

1) అప్పుల అనుమ‌తి కోసం వ్యవ‌సాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడ‌కి ఉరితాళ్లు బిగించిన‌ నీచుడు ఎవరు?

2) మూడేళ్ల పాల‌న‌లో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా?

3) రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా ? ఈ ఏడాది ధాన్యం కొన్నారా ?

4) 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ?

5) ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ?

6) తుఫాన్లు, అకాల వర్షాలతో, నష్టపోయి రైతులకు పంట నష్టం పరిహారం ఎంత ఇచ్చారు?

7) పంటలబీమా ప్రీమియం క‌ట్టామ‌న్నారు..రైతుల‌కి ఇన్సూరెన్స్ వ‌ర్తించ‌లేదెందుకు?

8) రూ.12,500 రైతు భరోసా  ఇస్తానని, రూ.7,500 ఇస్తుంది ఎవరు?

9) రాష్ట్ర‌వ్యాప్తంగా వున్న కౌలురైతుల‌ని అసలు గుర్తించారా?

10) వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయి ?

11) కేంద్రం తెచ్చిన వ్యవ‌సాయ‌రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరు?

12) ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడే మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడు ఎవరు?

13) టిడిపి హ‌యాంలో రైతులకు రూ.3లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని కేవలం రూ.1లక్షకే పరిమితం చేసింది ఎవరు?

14) రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే  ఆంధ్రప్రదేశ్ మూడ‌వ‌స్థానంలో వుండ‌టానికి కార‌కుడివి మీరు కాదా?

15) ముదిగొండ లో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న గారి చరిత్ర మర్చిపోయారా?

16) సోంపేట‌లో త‌మ భూముల్ని లాక్కోవ‌ద్దని ఆందోళ‌న చేసిన రైతులు ఆరుగుర్ని కాల్చి చంపించింది మీ నాయ‌న రాజ‌శేఖ‌రెడ్డి కాదా?

17) రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళ‌న‌లు చేస్తే టెర్రరిస్టుల్లా అమరావ‌తి రైతుల‌కి సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడు ఆదేశాల‌తో?

మరి ఈ ప్రశ్నలకు జగన్ గానీ.. వైసీపీ కానీ బదులు ఇస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: