చైనాను మనం ప్రత్యర్థిగా చూస్తాం.. మన పక్కలో బల్లెం అనుకుంటాం.. అనుకోవడం కాదు..అది పక్కలో బల్లెమే.. అనేక సరిహద్దు వివాదాల్లో ఈ విషయం రుజువైంది. కానీ.. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చైనా ఇండియాను సపోర్ట్ చేస్తోంది. తాజాగా అలా ఓ విషయంలో ఇండియాను సపోర్ట్ చేస్తూ.. ప్రపంచానికే షాక్ ఇచ్చింది చైనా.. ఇంతకీ అదేం విషయం.. చైనా ఎందుకు ఇండియాకు మద్దతు ఇచ్చింది. దీనిపై మిగిలిన ప్రపంచం ఎలా స్పందించింది.. చూద్దాం..


ఇటీవల ఇండియా గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిత్యవసర ధరల పెరుగుతున్నాయి కదా. అందుకే  వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో ఇండియా నుంచి గోధుమల ఎగుమతిని కేంద్రం నిషేధించింది. ముందుగా చేసుకున్నఒప్పందాల వరకు మాత్రమే ఎగుమతి చేసుకోవచ్చని.. కొత్తగా ఎగుమతుల గురించి ఒప్పందాలు కుదరవని తేల్చి చెప్పింది.


ఈ విషయంలో ఇండియా నిర్ణయంపై ప్రపంచ దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి.  భారత్‌ నిర్ణయాన్ని జీ 7 దేశాలు కూడా తప్పుపట్టాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఇండియాకు డ్రాగన్‌ కంట్రీ చైనా సపోర్ట్‌ చేసింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని చైనా కామెంట్ చేసింది. తన అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ లో భారత వైఖరిని సపోర్ట్ చేస్తూ ఓ కథనాన్ని చైనా ప్రచురించింది. గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శించేవారు.. తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదని చైనా ప్రశ్నించింది.


ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది తక్కువ వాటానే కదా అంటూ చైనా కామెంట్ చేసింది. వాస్తవానికి ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులని.. ముందు  గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలని చైనా జీ-7 దేశాలకు చురకలు వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: