కోదండరామ్‌.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. అయితే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరామ్‌ రాజకీయంగా ఎదగలేకపోయారు. ఆయన పెట్టిన తెలంగాణ జనసమితి అంతగా ఆదరణ పొందలేదు. అయితే.. కోదండరామ్‌ మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నారు. వచ్చే జాన్ 2న ఆత్మ గౌరవ దీక్ష చేయబోతున్నారు. తెలంగాణ ఉద్యమ కారులను ఏకం చేస్తామని.. ఆత్మ గౌరవం కోసం మరో పోరాటం ప్రారంభిస్తామని చెబుతున్నారు.


తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం  ఏమంటున్నారంటే.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆ స్థాయిలో తెలంగాణ పోరాటం జరిగింది.. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమం జరిగింది.. ఆంధ్రా పాలకుల ఒత్తిడిని తట్టుకొని, నిలబడి పోరాటం నిర్వహించారు.. అయితే.. తెలంగాణను తానే తెచ్చునట్లు కేసీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని కోదండరామ్ అంటున్నారు.


కేసీఆర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టారన్న కోదండరామ్‌.. సచివాలయం లేకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆర్ధిక రంగం రాజకీయంతో పెన వేసుకుందని.. ఇసుక, భూ దందాలు పెరిగిపోయాయని.. ప్రభుత్వం తీసుకు వచ్చిన కంపెనీల్లో తెలంగాణ బిడ్డలకు ఎంత మందికి ఉపాధి కల్పించారో శ్వేవెత పత్రం విడుదల చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ప్రవేశం తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రా గుత్తేదారులకే సునాయాసంగా మారిందన్న కోదండరామ్.. వైద్య, విద్యలో వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని ఆవేదన వ్యక్తం చేశారు.



ఏ ఆత్మ గౌరవం కోసం పోరాడమా.. ఆ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రా గుత్తేదారుల వద్ద తాకట్టు పెట్టిందని.. కేసీఆర్ ఆంధ్రా పాలకులకు దళారీగా మారిపోయారని.. జాన్ 2న ఆత్మ గౌరవ దీక్ష చేసి ఉద్యమ కారులను ఏకం చేస్తామని అంటున్నారు. మరి ఈ పోరాటంలో కోదండరామ్ ఎంత వరకూ సక్సస్ అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: