సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్ పై ఈటల రాజేందర్ మండిపడుతున్నారు. ముందు రాష్ట్రం సంగతి సరిగ్గా చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని.. ఉద్యోగులకు జీతాలు లేవని.. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని.. రాష్ట్రం అప్పులమయమయ్యి గతి లేక గత్యంతరం లేక ప్రజలమీద విపరీతం అయిన పన్నుల భారం మోపారని ఈటల రాజేందర్ ఆరోపించారు.


కేసీఆర్‌ పాలనలో లిక్కర్ బాటిల్స్ మీద రేట్లు పెంచారని.. భూముల రిజస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు.. కరెంటు ఛార్జీలు పెంచారని.. బస్సు ఛార్జీలు పెంచారని.. ఒక్క మాటలో చెప్పాలి అంటే  సంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్‌.. ఇక్కడ పరిపాలన చేతకాక.. నేను ఏదో వెలగ బెడతా అని బెంగాల్ పోతా, పంజాబ్ పోతా, కర్ణాటక పోతా అని అంటున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.


ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని దేశం తిరగడానికి పోయిన కేసీఆర్‌ను  చూసి తెలంగాణ ప్రజలు ధూ అని అంటున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లు ఉందంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్.. ఇక్కడ పరిపాలించే సత్తా లేక, సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ.. దేశం వెలగ బెడతా అని పోవడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు.


కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పకపోతే తెలంగాణకి అరిష్టం అని ప్రజలంతా భావిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అంటున్నారు. కేసీఆర్‌ ఇటీవల రాష్ట్ర రాజకీయాల కంటే.. దేశ రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ, హరియాణా టూర్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని ఇతర రాష్ట్రాలకూ వెళ్లనున్నారు. కేసీఆర్ టూర్‌ పై విపక్షాల నుంచి ఘాటు విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: