ఏపీ సీఎం దావోస్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సులో జగన్ పాల్గొంటారు. అయితే.. ఇప్పుడు ఆయన దావోస్ పర్యటనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే నారా లోకేశ్‌.. జగన్ కూడా మా నాన్న దారిలోనే వెళ్తున్నారని సోషల్ మీడియాలో స్పందించారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా జగన్ దావోస్ యాత్రపై సెటైర్లు వేస్తున్నారు. విదేశీ సంస్థలు పెట్టుబడికి స్టెబిలిటి చూస్తాయని.. అది లేనప్పుడు ఎన్ని పర్యటన లు చేసినా ప్రయోజనం ఉండదని పవన్ కల్యాణ్ విమర్శించారు.


ఏదో దావోస్‌ వెళ్లి పేపర్ల మీద సంతాకలు పెడితే పరిశ్రమ పెట్టినట్లు కాదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. వాస్తవ రూపంలో తీసుకువస్తే పరిశ్రమ లను స్వాగతిస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ఒక్కటే తెలుగు వారందరినీ ఒక్కటి చేస్తుందన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. స్టీల్ ఫ్లాంట్ అంశాన్ని ఇప్పటికే బిజెపి పెద్దలకి వివరించాన్నారు. ఏపీ  ప్రజల పట్ల కేంద్రానికి కూడా బాధ్యత ఉందని.. తాను చెప్పిన అంశాలను బిజెపి విశ్వసిస్తుందని నమ్ముతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అంటున్నారు.


రాష్ట్రం బలంగా ఉంటే జనసేన బలంగా ఉంటుందంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. జనసేన లో చేరేందుకు చాలా మంది ఆసక్తి గా ఉన్నారని తెలిపారు. 2007నుండి నేను రాజకీయాలలో ఉన్నానని.. నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా జీవితానికి ఇబ్బంది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. ప్రజలు, ఉద్యోగులు, రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా నిర్ణయం తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వివరించారు.


దేశంలో  ఎక్కడకి వెళ్లినా ఏపీ ఆర్ధిక పరిస్థితి పైనే చర్చ నడుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని జనం చర్చించు కుంటున్నారని.. ఢిల్లీ పెద్దల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని.. అందుకే శ్రీలంక తో ఎపి ని పోలుస్తున్నారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: