ఇటీవల వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సాక్షాత్తూ జగనే.. స్వయంగా రెండు చోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవకలేకపోయి నాయకుడు పవన్ అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. పవన్ కల్యాణ్‌ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని సవాల్ విసిరారు. ఇప్పుడు వైసీపీ చేసిన ఆ సవాల్‌ను పవన్ కల్యాణ్ స్వీకరించారు. ఎక్కడి నుంచి పవన్ పోటీ చేసినా ఓడిస్తామన్న వారి ఛాలెంజ్ ని స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ అంటున్నారు.


ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా  నిర్ణయించ లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. పొత్తు అంశం పై నేను ఎటువంటి ఆలోచన చేయలేదన్నారు. ప్రస్తుతం బిజెపి తో మాత్రమే కలిసి నడుస్తామని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓటు చీలకూడదని అనుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. రాజకీయాలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని.. ప్రజలకు సేవ చేయడం కన్నా.. నన్ను తిట్టడం పైనే కొంతమంది దృష్టి పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు.


తెలంగాణలో రాజకీయంగా ఎన్ని కొట్టుకున్నా.. బయట మంచి సంబందాలు కలిగి ఉంటారని.. ఏపీలో ఆ పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతు భరోసా యాత్ర లో వాళ్ల కష్టాలు చూసి చాలా బాధ కలిగించిందన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఎక్కడకి వెళ్లినా కౌలు రైతుల కన్నీళ్లు నన్ను కలచి వేశాయన్నారు. నా వంతు బాధ్యత అని భావించి సాయం అందిస్తున్నానని.. భూమి ఉన్న యజమాని కి ఇబ్బంది కలగకుండా కౌలు రైతులు కి గుర్తింపు కార్డు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ డిమాండ్ చేశారు.


భారతదేశం మొత్తం ఇది అమలు చేయాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రం లో ప్రజలకు ఉపయోగపడే అనేక పధకాలు నిలిపి వేశారని.. సిపియస్ విధానం లో కూడా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కామెంట్ చేశారు. జనసేన అధికారంలోకి వస్తే సిపియస్ రద్దు చేస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: