జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటన చేయడం ద్వారా పొత్తులు ఉంటాయని ఆయన చెప్పకనే చెప్పారు. కానీ ఆ తర్వాత ఎవరితో పొత్తు అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోగా మరింత గందరగోళంగా ఈ అంశంపై వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆయన ఈ అంశంపై స్పందించిన తీరు చూస్తే పవన్ విపరీతమైన గందరగోళంగా ఉన్నారనిపించక మానదు.


వైసిపి వ్యతిరేక ఓటు చీలదని ఐదు పదాల వ్యాఖ్య చేశానని.. దానికి వైసిపి వాళ్లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఏమి లేదనుకుంటే ... నా వ్యాఖ్యలు వదిలేయ వచ్చు కదా అంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలో మాకు క్లారిటీ ఉందంటూనే అంసంబద్ద వ్యాఖ్యాలు చేస్తున్నారు. జనసేన, బిజెపి కలిసే జనాల్లోకి వెళతామంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తుల అంశం పై కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారని.. కానీ ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడే చెప్పలేమంటున్నారు.


వ్యతిరేక ఓటు చీలకుండా కామన్ మినిమెమ్ ప్రోగ్రామ్ ఉండాలంటున్నజనసేన అధినేత పవన్ కల్యాణ్.. నా విధానాలకు మద్దతు ఇవ్వడం అనేది బిజెపి ఇష్టం అంటూ కామెంట్ చేశారు. నా అభిప్రాయాలు బిజెపి పెద్దలకు వివరిస్తానన్న పవన్‌.. రాష్ట్రం లో ఆర్ధిక పరిస్థితి, శాంతి భద్రతలు, అస్తవ్యస్త పాలన గురించి చెబుతానంటున్నారు. శాంతిభద్రతల విఫలం, అధ్వాన్న పరిస్థితి ని బిజెపి నేతలకు వివరిస్తానని.. తానును అన్ని మతాలను గౌరవిస్తా.. ఆరాధిస్తానన్నారు.


హిందూత్వ ఎజెండా దాటి బిజెపి చాలా చేస్తుంది కదా.. జనసేన చేస్తున్న సాయాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వరు.. బిజెపి విధానాలు ఎలా ఉన్నా... నా నిర్ణయం పై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.  తాను మోడీగారితో బాగా కనెక్ట్ అవుతానని.. నేను మాట్లాడే అంశాలు జాతీయ స్థాయిలో ఉంటాయని.. రాష్ట్ర బిజెపి తో కలిసి పని చేస్తున్నా... ప్రణాళిక లోపం ఉందని పవన్ అంగీకరిస్తున్నారు. అందరం కూర్చుని మాట్లాడుకుంటే సెట్ అవుతుందంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు లోపాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: