దేశంలో  ఏ రాష్ట్రం పరిస్థితి ఏంటి.. ఏ రాష్ట్రం దూసుకెళ్తోంది.. ఏ రాష్ట్రం చతికిల పడింది. అసలు దేశం పరిస్థితి ఏంటి.. అనే విషయాలను బేరీజు వేసుకోవడానికి అప్పుడప్పుడు కేంద్రం కొన్ని సర్వేలు నిర్వహిస్తుంటుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఇవి దేశంపై, ఆయా రాష్ట్రాలపై అవగాహనకు పని కొస్తాయి. తాజాగా ఇటీవల రాష్ట్రాలు- గ్రామీణాభివృద్ధి అనే కోణంలో స్కోచ్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో  ‘చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద అవార్డు’ను ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ దక్కించుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది.


ఉమ్మడి ఏపీ విభజన అనంతరం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆ నివేదిక తెలిపింది. ఫస్ట్ ప్లేస్‌ ఏపీకి ఓకే.. మరి మిగిలిన  రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటారా.. ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే.. ఇందులో  రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ లిస్టులో ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఒడిశా ఉంది. అలాగే నాలుగో స్థానంలో గుజరాత్‌, ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉన్నట్టు ఈ సర్వే చెబుతోంది.  స్కోచ్ సంస్థ ఏటా దేశంలో ఆయా రాష్ట్రాల పని తీరు పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తుంటుంది.


రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, కొత్త సంస్కరణలు, ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేసి ఈ ర్యాంకులు ఇస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌ ఈ సర్వేలో అనేక విషయాల్లో టాప్ ప్లేస్‌లో నిలిస్తే.. తెలంగాణ మాత్రం ఎక్కడా కనిపించలేదు. టాప్‌ ఐదు స్థానాల్లో తెలంగాణకు చోటు దక్కలేదు. ఇక సుపరిపాలన విభాగంలో దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే టాప్-5లో ఉంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం ఈ ఘనతను అందుకుంది.


ఈ ర్యాంకులు చూసి తమ నేత దేశంలోనే బెస్ట్ సీఎంగా ఎన్నికయ్యారని వైసీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. అది కూడా వరుసగా రెండోసారి ఈ స్థానంలో నిలవడం గ్రేట్ అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో అనేక మార్పులు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థు ఏర్పాటు చేశారు. అనేక ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలను చేరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: