ఈ నెల 27,28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా ఈ  మహానాడు ఉండాలని చంద్రబాబు నేతలకు చెప్పారు. ఈ మహానాడు మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నారట.


రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఒంగోలులో మహానాడు నిర్వహణ తలపెట్టిన నాటి నుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ  నేతలు మండిపడుతున్నారు. మొదట ఒంగోలులోని మీని స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.


చివరకు మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో కూడా రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారట. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని చంద్రబాబు నేతలతో అన్నారు. మహానాడు పార్టీ పండుగ అయినప్పటికీ.. ఈ సారి ప్రజలను నుంచి భారీ మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారట. మహానాడుకు సౌకర్యాలు, వేదిక నిర్మాణం, భోజన, వసతి  కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చంద్రబాబు చెప్పారు.


తన రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే.. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు  సూచించారు. పార్టీ వాలంటీర్ల వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవాలని..  మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. మొత్తానికి ఈ మహానాడుతో తెలుగు దేశం పార్టీకి ఊపు తీసుకురావాలని చంద్రబాబు ఉత్సాహంగా ఉన్నారు. చూడాలి ఎలా జరుగుతుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: