జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొంటున్నాయి. వరుసగా కాశ్మీరీ పండిట్ల కాల్చివేత ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు నెలల్లో 15 మంది వరకూ సైనికులలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అలాగే ఈ ఐదు నెలల్లో మరో 18మంది పౌరులు కూడా ఉగ్రవాద చర్యల కారణంగా చనిపోయారు. తాజాగా మంగళ వారం కూడా ఓ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరోవైపు తమకు రక్షణ పెంచాలని కాశ్మీర్ పండిట్లు కోరుతున్నారు.


పరిస్థితులు ఇలా ఉంటే.. కేంద్రం మాత్రం చోద్యం చూస్తోందని.. 18రోజులుగా కశ్మీరీ పండిట్లు ధర్నాలు చేస్తుంటే....కేంద్రం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. ప్రధానిజీ ఇది సినిమా కాదు వాస్తవమని మోదీకి రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చురకలు వేశారు.  భద్రత కరువై కశ్మీర్‌ పండిట్లు ఆందోళన చేస్తుంటే.....కేంద్రం వారిని పట్టించుకోవటం లేదని
రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తుంటే బీజేపీ 8ఏళ్ల మోదీ పాలన సంబరాల్లో బిజీగా ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు.


తాజాగా కుల్గాంలో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాశ్మీరీ పండిట్ల కుటుంబాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచేశారు.  కాశ్మీర్‌లో భద్రతా దళాలు, పౌరులు చనిపోతున్నారని, ఇది సినిమా కాదు నిజమని ప్రధాని మోదీకి గుర్తు చేశారు రాహుల్ గాంధీ. గత ఐదునెలల కాలంలో 15 మంది సైనికులు చనిపోయారని రాహుల్ తన పోస్టులో గుర్తు ేచశారు. ఈ ఐదు నెలల్లోనే 18మంది పౌరులు కూడా చనిపోయారని రాహుల్ గాంధీ తెలిపారు.


తాజాగా మంగళ వారం కూడా ఓ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చి చంపారని రాహుల్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీజీ ఇది సినిమా కాదు వాస్తవమంటూ రాహుల్ గాంధఈ పోస్టు పెట్టారు. 18రోజులుగా కశ్మీరీ పండిట్లు ధర్నాలు చేస్తుంటే కేంద్రం ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని రాహుల్ గాంధీ విమరశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: