తెలంగాణలో పార్టీ పెట్టి సత్తా చాటుతానని చెబుతున్న వైఎస్సార్‌ కూతురు షర్మిల చివరకు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాదయాత్రలో ఉన్న ఆమె.. నేలకొండపల్లి లో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తాను పోటీ చేయబోయే స్థానం ఏంటో ప్రకటించేశారు. -. 13 వందల కిలోమీటర్లు నడిచింది నేనే అయినా...నడిపించింది మీరే అంటున్న షర్మిల.. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.


నేను ఇక్కడ పోటీ చేయాలని మీరు కోరుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాల అంటూ ప్రసంగించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారన్నారు. ఇది వైఎస్సార్ కున్న చరిష్మా అని.. వైఎస్సార్ అనే మూడు అక్షరాలకు ఉన్న బలం అలాంటిదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్సార్ బలం ఇక మన సొంతం అంటున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. వైఎస్సార్ పేరు అస్తి అయితే ఏకైన వారసులం మనమేనన్నారు.


తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా నాకే ఉందన్న షర్మిల.. ఇతర వ్యక్తి కి...ఇతర పార్టీ కి ఆ హక్కులేదన్నారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం మన ఆస్తి అని.. ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా అని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజక వర్గం అన్న షర్మిల.. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదన్నారు.



తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందని..  ముఖ్యంగా వినిపిస్తున్న స్వరం పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని షర్మిల అన్నారు. అడుగడుగునా హారతులు పట్టుకుంటూ ప్రతి గ్రామంలో అందరూ అదే చెప్తున్నారని.. పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు  కాబట్టి దేవుడు తధాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకం అన్నారు. ఇవ్వాళ్టి నుంచి పాలేరు లో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు...నా కోరిక కూడా అంటూ తన సమ్మిత తెలిపారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు అంటూ ఖాయం చేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: