ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఇండియాపై దాడుల కోసం పాక్ టెర్రరిస్టులు హానీ ట్రాపింగ్‌ చేస్తున్నారు. మన దేశానికి చెందిన రక్షణ శాఖ, సైన్యంలో పనిచేస్తున్న కీలక అధికారులపై అమ్మాయిల వల విసురుతున్నారు. ఈ కాలంలో అంతా స్మార్ట్ ఫోన్ వాడేవారే. అందుకే ఆ మొబైల్‌నే తమ అస్త్రంగా వారు మలచుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాదులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరాల్లో దేశంలోనే 7 వ స్థానంలో ఉంది. అందుకే ఇంటి భద్రత నుంచి దేశ భద్రత వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం పెరిగింది.  సైబర్ నేరాలపై అంతా అవగాహన పెంచుకోవాలి.. సైబర్ నేరాలకు వేసే శిక్షలపై న్యాయ వ్యవస్థ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనిషి తన పరిజ్ఞానంతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తమై, అవగాహన కలిగి ఉన్నప్పుడే సైబర్ దాడులను ముందుగా అరికట్టే అవకాశం ఉంటుంది.


సైబర్ నేరాలు, సైబర్ భద్రత వంటి అవగాహన కోసం ఇటీవల విశాఖ పట్నంలో సైబర్ సేఫ్టీ - నేషనల్ సెక్యూరిటీ అంశంపై సదస్సు జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జరిగింది. ఈ సదస్సులో ప్రత్యక్షంగా, వర్చువల్ గా 7 రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రవేట్ ఐటీ రంగ నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఏడు రాష్ట్రాలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సదస్సు విశాఖ నగరంలో జరిగింది.


శత్రు దేశాలు మనదేశంపై సైబర్ దాడులు చేస్తూనే ఉన్నాయని.. మన వెబ్ సైట్స్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ హెచ్చరించడం విశేషం. సైబర్ నేరగాళ్లు మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. ఆ లింక్ లు పంపి ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను ఉపయోగించి అనేక మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులే లక్ష్యంగా ఉద్యోగాలు, లాటరీ, గిఫ్టుల పేరుతో మోసానికి పాల్పడుతున్న అంశంపై అప్రమత్తత అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: