ఒకరిని విమర్శించాలని మనం ఫిక్స్ అయితే.. అందుకు లాజిక్‌తో పని అవసరం లేదు. రాజకీయాల్లో ఇలా ఫిక్స్ అయ్యే నాయకులు చాలా మందే ఉంటారు. అలాంటి వారు.. ఎదుటి వారి గురించి విమర్శలు చేసేమందు లాజిక్‌ అంటూ ఏమీ వెదకరు.. ఎందుకంటే.. తాము ఎలా విమర్శించాలో ముందే ఫిక్స్ అవుతారు కాబట్టి.. అలాంటి వారిలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజును కూడా చెప్పుకోవచ్చు.


టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు.. ఇటీవల సీఎం జగన్‌ ను ఉద్దేశించి తరచూ బూతులు తిడుతున్నారు. అయితే.. ఆ కోపమో ఏమో కానీ.. రెండు రోజులుగా అయ్యన్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయన్న ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారంటూ అధికారులు ఆయన ఇంటి ప్రహారీ గోడను సైతం కూల్చేశారు. ఈ ఘటన తర్వాత అయ్యన్న పాత్రుడు పత్తా లేకుండా పోయారు. ఆయన కుమారుడు, భార్య ఏపీ సీఎం జగన్ అయ్యన్న పాత్రుడిపై కక్ష కట్టారని ఆరోపిస్తున్నారు.


అయితే.. అయ్యన్న ఇంటి కూల్చివేత అనేది అయ్యన్న తిట్లకు బహుమతిగా కావచ్చని జగన్ తత్వం తెలిసిన వారు అంచనా వేస్తున్నారు. అయితే. ఇలాంటి విషయంలో అయ్యన్నను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. వెనకేసుకొస్తున్నారు. అయ్యన్న ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడితే ఇంటి గోడలు బుల్డోజర్‌తో కూల్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత, ఫైర్‌బ్రాండ్ అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడితే ఇంటి గోడలు బుల్డోజర్‌తో కూల్చేస్తారా అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ రఘురామ..  గోదావరి భాష సరళంగా ఉంటుంది... అదే ఉత్తరాంధ్ర, నెల్లూరు, రాయలసీమలో యాస ఒక్కో విధంగా ఉంటుందని గుర్తు చేశారు. విజయనగరం, అనకాపల్లి, అనకాపల్లి, చోడవరం, చీపురుపల్లిలో చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనం.. ఆ సభలో అయ్యన్నపాత్రుడు ప్రసంగానికి స్పందన లభించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయ్యన్న కీర్తిని తట్టుకోలేక అయ్యన్న ఇంటిపై బుల్డోజర్ దాడి చేశారని.. ఈ వ్యవహారంపై కోర్టు స్పందించి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: