ఏపీ సీఎం జగన్ అమరావతి రైతులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విక్రయానికి అనుమతిస్తూ ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఇటీవల ఆలస్యంగా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులు ఆ విషయం జీర్ణించుకోకముందే.. జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.


సీఆర్‌డీఏ ఈ ప్రతిపాదనలను రూపొందిస్తే.. అందుకు ముఖ్యమంత్రి జగన్  ఆమోద ముద్ర వేశారని తెలుస్తోంది. ఉద్యోగుల కోసం నిర్మించిన ఒక భవనాన్ని లీజుకు తీసుకునేందుకు విట్ యునివర్సిటీ ముందుకొచ్చిందట. ఒక భవనాన్ని విట్ వర్సిటీకి లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ లీజు ద్వారా  ఏడాదికి 8 నుంచి 10 కోట్ల వరకు ఆదాయం అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముందుగా ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. భవనాల లీజుపై... త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందట.


ఈ గ్రూప్-డి కేటగిరీ కింద ఉద్యోగులకు 6 రెసిడెన్షియల్ టవర్లు నిర్మించారు. ఇక ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల్లేవు కనుక.. ఆ రాజధాని భూములనే అమ్మి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అమరావతి నిర్మాణ పనుల కోసం మొదటి విడతగా 15 ఎకరాలను విక్రయించేందుకు సీఆర్‌డీఏకి అనుమతి ఇచ్చింది.  ఈ మేరకు ఈనెల  6వ తేదీన జీవో ఇచ్చారు.


ముందుగా 15 ఎకరాలు..  ఇలా క్రమంగా దశలవారీగా 500 ఎకరాలను విక్రయించాలని జగన్ సర్కారు భావిస్తోందట. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావట్లేదని.. అందుకే ఇలా చేస్తున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ముందుగా కాజ-గుండుగొలను బైపాస్‌ రహదారి పక్కనే నవులూరు గ్రామం వద్ద 10 ఎకరాలు అమ్ముతారట. తర్వాత  సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలు అమ్మే ఆలోచన ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: