ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పాఠశాలలు తెరచుకుంటున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న 47. 40 లక్షల మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఇవాళ్టి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ కిట్ల కోసం  931.02 కోట్ల ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.


కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఈ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ ప్రారంభిస్తారు. ప్రతీ విద్యార్ధికీ దాదాపు  2 వేలు  రూపాయల విలువైన జగనన్న విద్యా కానుక అందిస్తారు. ఈ విద్యా కానుక కోసం మూడేళ్లలో  ఇప్పటివరకు 2,368.33 కోట్లు వ్యయం చేశారు. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న చర్యల వల్ల  2018 – 19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 7 లక్షలుకు పైగా పెరిగారు.   2021 – 22 నాటికి ఈ సంఖ్య 44.30 లక్షలకు చేరింది.


ప్రభుత్వ, ప్రేవేట్‌ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరింది. మొత్తం 52 వేల 676.98 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వెచ్చిస్తోంది. విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యేలా, ప్రపంచస్ధాయిలో పోటీపడేలా.. దేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఏటా  24 వేల వరకు ఖర్చుతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న ఈ స్డడీ మెటీరియల్‌ ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉచితంగా అందించబోతున్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతిలో చేరబోతున్న 4.7 లక్షల మంది విద్యార్ధులకు  500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికీ దాదాపు  12వేల విలువ చేసే ట్యాబ్‌లు ఉచితంగా ఈ సెప్టెంబర్‌ లో ఇస్తారు. ఇకపై ప్రతి ఏటా 8 వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్ధికి ఫ్రీగా ఈ ట్యాబ్‌లు అందజేస్తారు. భవిష్యత్తులో డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు బోధించే దిశగా ప్రతి క్లాస్‌ రూమ్‌లో టీవీ లేదా డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: