సరైన విద్య అందిస్తే పేద విద్యార్థులు అద్భుతాలు సాధిస్తారు. జగన్ ప్రభుత్వం మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. విద్యపై చక్కటి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ బడులతో పాటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా జగనన్న విద్యా కానుక కిట్టు వంటి సౌకర్యాలు  అందిస్తోంది. ఉచితంగానే నాణ్యమైన కిట్లు అందిస్తున్నారు. 2020–2021లో విద్యా కానుకకు అక్షరాల రూ.652 కోట్లు ఖర్చు చేసింది జగన్ సర్కారు. 2021–2022లో రూ.790 కోట్ల వ్యయంతో విద్యా కానుక కిట్లు అందించింది. ఈ ఏడాది కిట్లకు రూ.1964 చొప్పున ఖర్చు చేస్తూ 47 లక్షల మంది పిల్లలకు రూ.931 కోట్లు ఖర్చు చేసింది.


అంతే కాదు.. 8వ తరగతి చదువుతున్న ప్రతి పిల్లాడికి అక్టోబర్‌లో ఒక లాప్‌టాప్‌ ఇస్తామంటున్నారు. రూ.12 వేలు విలువ చేసే లాప్‌టాప్‌ను ఇవ్వబోతున్నారు. దీని కోసం మరో రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని, ఆ కంటెంట్‌ సులభంగా అర్థమయ్యేలా అనుసంధానం చేయబోతున్నారు. అలాగే సీబీఎస్‌ఈ పరీక్షలు ఇంగ్లీష్‌లో రాసి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.


విద్యా కానుక కిట్లు ప్రతి విద్యార్థికి ఉచితంగా కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫాం అదిస్తున్నారు. ఉచితంగా బైలివింగ్‌ టెస్ట్‌బుక్స్, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు ఇస్తున్నారు. కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లలకు డిక్షనరీలు ఇస్తున్నారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో కేవలం విద్యారంగంపైనే అమ్మ ఒడి పథకం కోసం అక్షరాల రూ.19617 కోట్లు ఖర్చు చేసింది.


అలాగే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పెద్ద చదువులు ఉచితంగా అందించేందుకు రూ.7700 కోట్లు ఖర్చు చేసింది. విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం వసతి దీవెన కింద రూ.3329 కోట్లు ఖర్చు చేసింది. అలాగే గోరుముద్ద పథకం కోసం ఏడాదికి రూ. 1800 కోట్లు వ్యయం చేస్తోంది. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణం పేరుతో ఏడాదికి రూ.1950 కోట్, విద్యా కానుక ద్వారా ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిర్ణయాలతో ఓ తరం భవిష్యత్‌ మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: