కేఏ పాల్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ కామెడీ పీస్‌ గా మారారు. కానీ.. ఆయన మొన్నటి వరకూ మత ప్రచారకర్త.. కానీ ఇప్పుడు తనను తాను ఆయన సీరియస్ పొలిటీషియన్‌గా చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పార్టీ అధినేతగా త్వరలో ప్రజాయాత్రలు చేస్తానని మొన్న ప్రకటించారు కూడా. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్య పరుస్తానన్నారు. అలాంటి కేఏ పాల్‌కు ఇప్పుడు మోడీ, అమిత్‌షా నుంచి పిలుపు వచ్చిందట.


ఈ విషయాన్ని ఆయనే స్వయంగా విజయనగరంలో చెప్పుకున్నారు. విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్న కేఏ పాల్‌.. గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ పెడతాను అని  నరేంద్రమోదీ, అమిత్ షా, రూపలాని కోరానని.. ఇప్పుడు మోడీ, అమిత్ షా పిలుపు మేరకు నేను ఢిల్లీ వెళుతున్నానని కేఏ పాల్‌ చెప్పారు. అందుకే వారం పాటు పాల్ రావాలి - పాలన మారాలి  యాత్ర కి విరామం ఇస్తున్నానని విజయనగరంలో తెలిపారు.


పాల్ ఇంకా ఏమన్నారంటే.. “ మన దేశం శ్రీలంక లాగా ఐపోతుంది.. దేశంలో వివిధ సమ్మిట్లు పెట్టాల్సిన అవసరం ఉంది.. లేదేంటే మనం భారీగా ఆర్ధిక లోటులోకి వెళ్లిపోతున్నాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 8 లక్షలు కోట్లుకి చేరుకొంది.. నాయ్య వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది.. 2014, 19 ఎలక్షన్స్ లో మోడీ, చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశాననని కేఏ పాల్‌ చెప్పుకొచ్చారు.


రెండు తెలుగు రాష్ట్రల్లో ఎక్కడ చూసిన భూములు, కొండలు ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారని.. తెలంగాణలో కె.సి.ఆర్. కుటుంబం మొత్తం తవ్వేస్తున్నారని కేఏ పాల్‌ మండిపడ్డారు. జగన్ కి అప్పులు ఇచ్చేవారు కూడా కనబడడం లేదు.. ఇది దౌర్బాగ్యం.. తెలంగాణలో కె.సి.ఆర్ మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నానను.. ఈ రోజున తెలంగాణలో చేస్తున్న సర్వేల్లో కె.ఏ.పాల్ మాకు కావాలి రావాలి అని 75 శాతం ప్రజలు కోరుకుంటున్నారని కేఏ పాల్‌ అంటున్నారు. అవినీతిపరులు మీద యాక్షన్ తీసుకోవాలి అని మోడీ, అమిత్ షా కి లేఖలు ఇచ్చానన్న కేఏ పాల్‌.. తన ప్రాణం పోయినా పరవాలేదు.. నేను ప్రజలని, దేశాన్ని కాపాడటానికి వచ్చానంటూ ఆవేశపడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: