బీజేపీ, చంద్రబాబు గత ఎన్నికల్లో కత్తులు దూసుకున్న సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మోడీ, అమిత్‌షాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఆ తర్వాత మళ్లీ మోడీయే ప్రధాని అయ్యాక సీన్ మారిపోయింది. చంద్రబాబు అప్పటి నుంచి ఫుల్ సైలంట్ అయ్యారు.  తాజాగా చంద్రబాబు నరేంద్ర మోదీని మెచ్చుకుంటూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 
సామాజిక న్యాయం కోసం ద్రౌపది ముర్మును బలపరచాలని నిర్ణయించామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు.  కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, రాం నాధ్ కోవింద్, ముర్ములు రాష్ట్రపతి ఎంపికలో తాను భాగస్వామిని కావటం తన  అదృష్టమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.  తెలిపారు.  అబ్దుల్ కలాం, రాం నాధ్ కోవింద్, ముర్ములు రాష్ట్రపతి ఎంపికలో రాష్ట్రం నుంచి మద్దతు ఏకగ్రీవం అయ్యిందని గుర్తు చేశారు. దేశ ప్రధమ పౌరులు ఎంపికలో భాగస్వామ్యం కావటం అదృష్టమన్నారు.


పేద కుటుంబం లో పుట్టిన ఆదివాసీ అయిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారన్న చంద్రబాబు.. సాధారణ పౌరులు అసాధారణ పదవికి ఎన్నిక కావటం మన రాజ్యాంగం విశిష్టత అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నరేంద్ర మోదీ కి తన అభినందనలు అంటూ మెచ్చుకున్నారు. ద్రౌపది ముర్ము సిన్సియార్టీకి ఎంతో గౌరవం లభిస్తుందని.. ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపటం అంతా గర్వించతగ్గ విషయమని చంద్రబాబు కొనియడారు.


ముర్ము కూడా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఏమన్నారంటే.. "నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన తెదేపాకు కృతజ్ఞతలు.. ఏపీకి, ఒడిశాకు ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.. దేశ అత్యున్నత పదవి అధిష్టించేందుకు అంతా సహకరించాలి.. అంటూ కోరారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును సత్కరించిన చంద్రబాబు... రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు. పేద కుటుంబంలో జన్మించిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము.. అని.. మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ముర్ము అంటూ ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: