ఇటీవల గోదావరికి వచ్చిన వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక పంపు హౌసులు అన్నీ మునిగిపోయాయి. అయితే.. ఇలా మునగడం వల్ల అవి ఇక పనికిరావని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరో నాలుగేళ్ల వరకూ ఈ పంపు హౌసులు పని చేయవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ కూడా ఈ అంశంపై విమర్శలు గుప్పించారు.


అయితే.. ఈ విమర్శలను ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. వరదలపై విపక్షాలు విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్  ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారని తెలిపారు. కానీ.. విపక్ష నేతలు పార్టీ కార్యాలయాల్లో మీడియా ముందు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.


కాళేశ్వరం పంప్ హౌజ్‌ల నీటమునకపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. పంప్ హౌస్‌లు అనేవి ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న కనీస ఇంగిత జ్ఞానం కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదని మండిపడ్డారు. ఎంతసేపు ప్రభుత్వం, కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదని.. కేంద్ర ప్రభుత్వ వరద సాయం ఏది...? గుజరాత్‌కు తప్ప కేంద్రం తెలంగాణకు సాయం చేయదా?  అని నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు మాట వరసకైనా తెలంగాణకు వరద సాయం ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగరని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. ప్రశ్నించారు.


తెలంగాణ ధాన్యం కొనుగోలు, నిధుల కేటాయింపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, వర్శిటీలపై కేంద్ర ఆటంకాలు సృష్టిస్తోందని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. మెడికల్ కళాశాలల కేటాయింపు, ప్రభుత్వ రుణాల సేకరణ వంటి ప్రతి విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. కేంద్రం అడ్డంకులు అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ పథకాలను సజావుగా కొనసాగిస్తున్నారని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: