బీజేపీ కూటమి ఎన్డీఏలో వైసీపీ భాగస్వామ్య పార్టీ కాకపోయినా.. మోదీ సర్కారుకు అన్ని విధాలా సహకారం అందిస్తోంది జగన్ పార్టీ.. అయితే.. ఇటీవల వీరిద్దరికీ చెడిందా.. అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. దేశంలోని పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి శ్రీలంక తరహాలో తయారవుతోందంటూ ఇటీవల కేంద్రమంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఏపీ మండిపడుతోంది. పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు.


రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  అంత మాట అన్నారంటే.. విషయం చాలా దూరం వెళ్లి ఉండవచ్చన్న విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. ఏపీ అప్పులపై కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సరైన విధానంలో లేదని భావిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ..  ఏపీ అప్పులు చేస్తున్న మాట వాస్తవమే అయితే వాటిని ఎక్కడ ఎలా ఖర్చు చేస్తున్నామన్న వివరాలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేకే ఆర్థికంగా దివాళా తీసిందని విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.


అసలు ఒక దేశాన్ని తీసుకుని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు ముడి పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి  అంటున్నారు. శ్రీలంకను కేంద్రం ఉదాహరణ గా చూపడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం తో పోల్చవచ్చు కానీ వేరే దేశంతో ఎలా పోల్చుతారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. శ్రీలంకలో వ్యవసాయ ఉత్పత్తి పడిపోయి దిగుమతులపై ఆధారపడ్డారని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.


ఏపీని శ్రీలంకతో పోల్చినప్పుడు కేంద్రం చేసిన అప్పులు గురించి మంత్రులు ఎందుకు చెప్పలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి నిలదీశారు. పార్లమెంట్ లో ప్రశ్న అడిగి తెదేపా తాము తీసుకున్న గోతిలో తనే పడిందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లి శ్రీలంక గురించి మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: