మోడీ సర్కారు ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు.. సైన్యంలోనూ పని చేసి వచ్చారు.. మోడీ ప్రభుత్వ విధానాలు దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయంటున్న కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బయటకు చెప్పకుండా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆర్మీ, నేవి, వాయు సేనలను బలహీన పరుస్తున్నాయని విమర్శిస్తున్నారు.


ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లో ఉండాల్సిన సంఖ్యా బలం లేకుండా సైన్యం బలగాన్ని తగ్గిస్తున్నారని..ప్రస్తుతం భారత దేశానికి రెండు వైపుల నుంచి ముప్పు పొంచి ఉందని..స్వాతంత్రం వచ్చాక తొలిసారి ఒకే సమయంలో పాక్, చైనా తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఆర్మీలో 1,16,464 సైనికుల బలం తక్కువగా ఉందని.. నావికా దళంలో 13,597  బలం తక్కువగా ఉందని.. వైమానిక దళం లో 5,723 మంది తక్కువగా ఉన్నారని.. ఇలాంటి సమయంలో అగ్నిపథ్ ద్వారా త్రివిధ దళాలను మరింత బలహీన పరుస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.



ఆర్మీలో సంవత్సరానికి 60 వేలు ఉంటే ఇప్పుడు కేవలం అగ్నిపథ్ ద్వారా 40 వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నారంటున్న కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అగ్నిపథ్ ద్వారా ఆర్మీ 40 వేలు, నేవి 3 వేలు, ఎయిర్ ఫోర్స్ 3 వేల పోస్టులు ఇస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే కావాల్సిన దానికన్నా తక్కువ మంది సైన్యం ఉంటే.... అగ్నిపథ్ ద్వారా ఇంకా తక్కువ మందిని తీసుకుంటున్నారని.. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని విమర్శిస్తున్నారు.


కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని.. ఆర్మీ స్కిల్స్ చంపేసేలా అగ్నిపథ్ పథకం ఉందని.. పార్లమెంట్, పార్లమెంట్ కమిటీలో చర్చించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: