విశాఖ రాజధానిగా పాలన సాగించాలని భావిస్తున్న సీఎం జగన్.. ఆ నగరంపై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకించి పేదలకు మేలు చేయడం ద్వారా నగర వాసుల ఆదరణ పొందాలనుకుంటున్నారు. అందుకే విశాఖలో గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలంటున్న సీఎం జగన్.. చేసిన పనులకు నిధులుకూడా సక్రమంగా విడుదల చేస్తున్నామని గుర్తు చేశారు.


విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ వేగంగా పెరగాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖపట్నంలో ఇచ్చిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్నిరకాలుగా సిద్ధంచేస్తున్నామన్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ అక్టోబరు చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. వీటి నిర్మాణం వేగంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జగన్.. లక్ష్యంలోగా పూర్తి చేయాలన్నారు.


ఇక విశాఖలో ఆప్షన్‌ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణంతోపాటు... కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పించాలని సీఎం జగన్  అన్నారు. ఈ  పనులపైన దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటు డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని.. ఏ విషయంలోనూ లోటు రావద్దని సీఎం జగన్ ఆదేశించారు.


కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి  వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని అక్కడ నుంచే ఏర్పాటు చేశామని అధికారులు జగన్‌కు వివరించారు. , సందేహాల నివృత్తికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రయత్నం బావుందన్న జగన్.. ప్రత్యేకించి ఒక పోన్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. మొత్తం మీద ఇక్కడ లక్షా 24 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయితే.. విశాఖపై జగన్ ముద్ర పడినట్టేనని వైసీపీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: