కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరారు. ఆయన్ను పార్టీలోకి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వివేక్, మురళీధర్ రావు తదితరులు ఆహ్వానించారు. బీజేపీలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్టు ఉందన్న దాసోజు శ్రవణ్‌ .. గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన విషయం గుర్తు చేసుకున్నారు. 1700 మంది త్యాగలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న దాసోజు శ్రవణ్‌ .. తెలంగాణ అనేక రంగాల్లో విధ్వంసం అయ్యి.... అప్పుల కుప్పగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


తెలంగాణలో అధికార మార్పిడి అవసరం ఉందన్నదాసోజు శ్రవణ్‌.. కేసీఆర్ గద్దె దిగాలి... కేసీఆర్ ను గద్దె దించే పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రజాస్వామ్య తెలంగాణ ను నిర్మించేలా, జయశంకర్ ఆశయాలు సాధించేలా బీజేపీలో  పనిచేస్తానన్నారు దాసోజు శ్రవణ్‌. టిఆర్ఎస్ నేతలు తెల్ల రేషన్ కార్డులతో అవినీతికి పాల్పడుతున్నారని.. తెలంగాణ వ్యాప్తంగా చీకోటి ప్రవీణ్ లు ఉన్నారని.. చీకోటి ప్రవీణ్ లాంటి వారిని టిఆర్ఎస్ నేతలు మోస్తున్నారని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.


భవిష్యత్ లో పుట్టే పిల్లల పైనా అప్పుల భారం పడిందన్న దాసోజు శ్రవణ్‌.. ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణ లో లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. 35 వేలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు చేరిందని.. కాళేశ్వరం కాదు కెసిఆర్ కమిషనరేశ్వరంగా మారిందని.. బిస్వాల్ కమిటీ లక్షన్నర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినా.... 80-90 వేల ఉద్యోగాలు ఇస్తున్నారని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని.. స్కిల్ డెవలప్ మెంట్ లేక యువకులు బిచ్చగాళ్లుగా తయారయ్యి... ఉపాధి హామీ పనులు చేసుకోవాల్సి వస్తుందని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు.


నిరంకుశంగా తెలంగాణ ను పోలీస్ రాజ్యంగా చేశారని విమర్శించిన దాసోజు శ్రవణ్‌.. నీళ్లు, నియామకాలు, నిధులు, ఆత్మగౌరవాన్ని కించ పరుస్తున్నారన్నారు. వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి.. కేటిఆర్ పిల్లలను టీచర్లు లేని స్కూల్ లో చదివిస్తారా అని దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.
పాఠశాలల్లో సరైన వసతులు లేవని.. పేదవారు చదువుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి దుర్భరంగా ఉందని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp