చైనా.. ఇప్పుడు అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం.. ఒక్కోసారి చైనా అమెరికాను దాటేస్తుందేమో అనిపింస్తోంది కూడా. అనేక రంగాల్లో ఇప్పుడు చైనా గుత్తాధిపత్యం చూపిస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగంలో బలమైన దేశంగా అవతరించి ప్రపంచ తయారీ రంగాన్ని శాశిస్తోంది. అలాంటి చైనా దేశాన్ని ఓ చిన్న దేశం ఇబ్బంది పెడుతోంది. అదే తైవాన్‌.


తైవాన్ తన అంతర్భాగమని చైనా ప్రకటిస్తుంటే.. తైవాన్ మాత్రం తాను స్వతంత్ర్యదేశంగా భావిస్తుంటుంది. అయితే.. తైవాన్‌ ప్రత్యేక దేశంగా మనుగడ సాగిస్తే చైనా అధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడైన జిన్‌పింగ్‌ బలహీనపడతాడు. అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ఠా మసకబారుతుంది. అందుకే తైవాన్‌ను హస్తగతం చేసుకోవాలని చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.


అందుకే భయపెట్టి అయినా సరే తైవాన్ను స్వాధీనం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు తైవాన్ ప్రాంతం సముద్రంలో చైనాకు వ్యూహాత్మక ప్రాంతం కూడా. అందుకే అమెరికా వంటి దేశాలు కూడా తైవాన్ ను స్వతంత్ర్య దేశంగా గుర్తిస్తూ చైనాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా వంటి దేశాన్ని కట్టడి చేయాలంటే.. తైవాన్ వంటి దేశాలు అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరం అవుతాయి. అందుకే తైవాన్‌ను అన్నివిధాలా సాయం చేయాలని అమెరికా తలపోస్తోంది.


ఈ నేపథ్యంలో చైనా వద్దంటున్నా సరే.. అమెరికా దిగువ సభ స్వీకర్ నాన్సీ ఇటీవల తైవాన్ లో పర్యటించడం ద్వారా ఆ దేశాన్ని తాను గుర్తిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇదే చైనాకు ఇబ్బంది కరంగా మారింది. అందుకే తైవాన్‌ సమీపంలో యుద్ధ విన్యాసాలు జరుపుతూ చైనా భఘయపెడుతోంది. ఇక్కడ పరిస్థితి అదుపు తప్పి ఏక్షణమైనా సాయుధ పోరాటం ప్రజ్వరిల్లే ప్రమాదం కూడా ఉందని  నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో క్యూబా- అమెరికా యుద్ధం వెనుక రష్యా క్యూబాకు అండగా అణు క్షిపణులు తరలించింది. ఇప్పుడు అమెరికా కూడా అదే తరహాలో తైవాన్‌కు అండగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: