ఇవాళ 76 వ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భముగా విజయవాడలో ఘనంగా స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము అందిస్తున్న సమాచారం ప్రకారం వాహనదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి కంట్రోల్ రూమ్ వైపు నుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళు  అన్నీ వాహనములు.. ఆర్.టి.సి. వై జంక్షన్ నుండి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్ , దీప్తి సెంటర్  పుష్పా హోటల్ , జమ్మిచెట్టు సెంటరు, సిద్ధార్థ జంక్షను మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లిస్తారు.


అలాగే ఆర్.టి.సి. వై జంక్షన్ నుండి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్ ,నేతాజీ బ్రిడ్జ్, గీతానగర్, స్క్యూ బ్రిడ్జ్  మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు పంపిస్తారు. బెంజ్ సర్కిల్ వైపునుండి బందర్ రోడ్ లోనికి వచ్చు వాహనములను బెంజ్ సర్కిల్    నుండి ఫకీర్ గూడెం– స్క్యూ బ్రిడ్జ్- నేతాజీ బ్రిడ్జ్- బస్టాండ్ వైపుకి మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుండి ఆర్.టి.ఎ. జంక్షన్ ,శిఖామణి సెంటర్ నుండి వెటరినరీ    జంక్షన్ వరకు ఏ విధమైన వాహనములు అనుమతించరు.


ఇక బెంజ్ సర్కిల్ నుండి డి.సి.పి. బంగ్లా కూడలి వరకు అంటే యం. జి. రోడ్ నందుయ.. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు. ఆర్. టి.సి. సిటీ బస్సులు మళ్లింపు విషయానికి వస్తే..  ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఆర్.టి.సి “వై” జంక్షను నుంచి  బెంజ్ సర్కిల్ వైపుకు ఆర్.టి.సి బస్సులు అనుమతించరు. ఆర్.టి.సి. “వై” జంక్షను నుండి బండరు రోడ్డు మరియు రూట్ .నెం.5 లో వెళ్ళే     ఆర్.టి.సి. సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్ళి అక్కడనుండి బెంజ్ సర్కిలు వైపుకు వెళ్లాల్సి ఉంటుంది.


’’AA పాస్’’కలిగిన వారు గేట్ నం. 3 (ఫుడ్ కోర్ట్)  నుండి ప్రవేశించి అక్కడే నిర్దేశించబడిన స్థలములో వాహనాలు పార్కింగ్   చేయాలి. “A1, A2  ”పాస్ కలిగిన వారు గేట్ నం. 4 ద్వారా లోపలికి వెళ్లి వాహనములను హ్యాండ్ బాల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: